Fine Rice : రేషన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వనున్న ప్రభుత్వం..!
ప్రధానాంశాలు:
Fine Rice : రేషన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వనున్న ప్రభుత్వం..!
Fine Rice : తెలంగాణ Telangana రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం సన్న బియ్యంని ప్రోత్సహించింది. సన్న బియ్యం పండించేందుకు రైతులను ప్రోత్సహించిన ప్రభుత్వం, 500 రూపాయల బోనస్ సైతం ప్రకటించింది.

#image_titleFine Rice : రేషన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వనున్న ప్రభుత్వం..!
Fine Rice ప్లాన్ ఇదే..
వచ్చే ఉగాది Ugadi పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యాన్ని నిరుపేదలకు రేషన్ షాప్ ల ద్వారా అందించేందుకు రెఢీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సన్నబియ్యాన్ని సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
మార్చి 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది. మార్చి 31 లోపులు చాలా మందికి ఈ కార్డులు వచ్చేస్తాయి. ఈ కార్డులతో సన్నబియ్యం తీసుకోవడమే. ఈ క్రమంలో మిల్లర్లు సన్న బియ్యాన్ని పక్కదారి పట్టించకుండా జాగ్రత్తగా సేకరిస్తోంది. ఎందుకంటే ఆ సన్నబియ్యాన్ని పేదలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మొదట కార్డులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి Revantj Reddy అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిశాక మిగతా జిల్లాల్లో పంపణీ చేయాలన్నారు.