Panchayat Elections : బిగ్ బ్రేకింగ్.. పంచాయతీ ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఎప్పుడు అంటే..!
ప్రధానాంశాలు:
Panchayat Elections : బిగ్ బ్రేకింగ్.. పంచాయతీ ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఎప్పుడు అంటే..!
Panchayat Elections : గత కొద్ది రోజులుగా తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడిచింది. ఇక పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ కూడా ఇటీవల ఎక్కువగా సాగింది. సెప్టెంబర్‌లో అని కొందరు, ఆగస్ట్ లో అని కొందరు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావొస్తుందన్నారు.
Panchayat Elections రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు. అయితే ఆగస్టులోనే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి భావించడానికి కారణం ఆగస్టు 15తో రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టి ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు రేవంత్. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలూ ఉండవని భావిస్తున్నారు.
అందుకే వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్. అందుకే వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తించేలా చట్టం చేయగా ఈసారి కూడా ఇవే రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామా పంచాయతీలు ఉండగా, ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి.