Bade Nagajyothi : ములుగులో సీతక్కపై పోటీకి సై అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి.. అసలు ఎవరీమె?
Bade Nagajyothi : బడే నాగజ్యోతి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈమె ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఎందుకంటే ములుగు నియోజకవర్గంలో సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ పార్టీ ఈమెను బరిలోకి దించింది. ములుగు జిల్లా వాళ్లకు బడే నాగజ్యోతి సుపరిచితమే కానీ.. వేరే జిల్లా వాళ్లకు ఆమె అంతగా తెలియని పేరు. కానీ.. ఆమెను నమ్మి కేసీఆర్ ఎలా ములుగు టికెట్ ఇచ్చారు అనేదే ఎవ్వరికీ అంతుపట్టని విషయం.
అయితే.. ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. బడే నాగజ్యోతి ఎవరో కాదు.. నక్సల్స్ ఉద్యమకారుడు బడే ప్రభాకర్ కూతురు. బడే ప్రభాకర్, ఆయన భార్య నిర్మలక్క ఇద్దరూ ఉద్యమంలో పని చేసిన వాళ్లే. వాళ్ల కూతురే బడే నాగజ్యోతి. వాళ్లిద్దరూ నక్సల్స్ ఉద్యమంలో తిరిగి చివరకు అసువులు బాసారు.అయితే.. నాగజ్యోతి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత సీతక్క లాంటి లీడర్ ఉన్న ప్రాంతం అయినప్పటికీ ములుగులో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు.
Bade Nagajyothi : ములుగు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర
ఆమె కీలకంగా వ్యవహరించారు. తాడ్వాయి జెడ్పీటీసీగా గెలుపొందిన తర్వాత ఆమెను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా నియమించారు. ములుగులో సీతక్కను ఓడించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కీలక నేత. అందుకే.. ఆమెను ఓడించాలంటే అదే నక్సల్స్ నేపథ్యం ఉన్న నేత అయితేనే కరెక్ట్ అని భావించిన కేసీఆర్.. బడే నాగజ్యోతిని బరిలోకి దించారు. అందుకే ఇప్పుడు బడే నాగజ్యోతి గురించి అందరూ చర్చిస్తున్నారు. కానీ.. సీతక్క బలం ముందు బడే నాగజ్యోతి నిలబడుతుందా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.