Ys Jagan Schemes : తెలంగాణలో జగన్ పథకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
ప్రధానాంశాలు:
Ys Jagan Schemes : తెలంగాణలో జగన్ పథకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
Ys Jagan Schemes : జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చాలానే సంచలనాలుగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఎంతో ఆలోచించిన తర్వాతనే ఆయన పరిపాలన సౌలభ్యాన్ని సులభతరం చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించేస్తున్నారు జగన్. ఇది చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాన్ కూడా తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.. జీతాలు కూడా పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ కు మరో అరుదైన గుర్తింపు దక్కుతోంది.
Ys Jagan Schemes : మంత్రి కీలక ప్రకటన..
అదేంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా త్వరలోనే తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎన్నికలకు ముందు రేవంత్ సూచన ప్రాయంగా దానిపై మాట్లాడారు. అయితే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ మీటింగ్ లో మాట్లాడుతూ తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. సచివాలయాలకు, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. అయితే వాలంటీర్లకు రూ.10వేలు కూడా ఇస్తామని ఆయన ప్రకటించడం ఇక్కడ గమనార్హం.
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేసేందుకు ఆలోచన చేస్తున్నామని చెబుతున్నారు. దాంతో వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి జగన్ విధానాలను రాజకీయ పరంగా వ్యతిరేకిస్తున్నా సరే జగన్ పథకాలను మాత్రం ఫాలో అవుతున్నారంటే జగన్ మంచి చేస్తున్నాడని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటి అని అడుగుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏపీకి తమ అధికారులను పంపించి వాలంటీర్ల వ్యవస్థపై అద్యయం చేయించాయి. వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఏదేమైనా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త అధ్యయనానికి తెరతీస్తున్నాయని చెప్పడానికి ఇవే నిదర్శనం అంటున్నారు వైసీపీ నేతలు.