సమస్యలే ఆయుధంగా కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల
తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోవాలనే కోరిక తో సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న షర్మిల కు గత కొద్దీ రోజులుగా కాలం కలిసిరావడం లేదు. పార్టీ ప్రకటించాలని భావించిన తరుణంలో కరోనా సెకండ్ వేవ్ రావటంతో కొంచం గ్యాప్ వచ్చింది. ఇదే సమయంలో తెరాస నుండి ఈటల బయటకు రావటం, కేసీఆర్ కు వ్యతిరేకంగా మారిపోవడంతో రాజకీయం మొత్తం అటు వైపు మళ్లింది. దీనితో షర్మిలను పట్టించుకునే వాళ్లే లేకుండాపోయారు.

Ys sharmila targeted kcr
ఇలాంటి సమయంలో మరింత సైలెంట్ అయితే ఉనికే ప్రమాదంలో పడుతుందని గ్రహించిన షర్మిల సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ పై విమర్శలు చేస్తూ, రాష్ట్రంలోని సమస్యలను లేవనెత్తుతూ తనదైన రాజకీయం చేస్తుంది. తెలంగాణ లో యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఒక సరి, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని మరోసారి డిమాండ్ చేసిన షర్మిల, తాజాగా మరో సమస్యను లేవనెత్తి కేసీఆర్ సర్కార్ ను ఇరుగున పెట్టె విధంగా ఆరోపణలు చేసింది.
స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకు సంబధించి షర్మిల మరోసారి తన స్వరం వినిపించింది. 2017 సెప్టెంబర్ 9 న 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అని, కటాఫ్ మార్కుల ఆధారంగా 3,170 మంది అర్హత సాధించారు అని,2,418 మందిని మాత్రమే టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది అని మిగతా 658 మందిని ఎలాంటి కారణాలు లేకుండా పక్కన పెట్టింది అని ఆరోపిస్తూ ఏకంగా తెలంగాణ సీఎస్ కు షర్మిల లేఖ రాయటం జరిగింది.
ఉద్యోగాలు రాని 658 మంది తమ సమస్యను టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు అని అన్నారు. కరోనా సమయంలో స్టాఫ్ నర్సుల సేవలు ఉపయోగించుకోవడం పోయి .. వారిని పక్కన పెట్టడం సరికాదు అని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పెద్ద మనసుతో మీరు చొరవ తీసుకోవాలి అని ఆమె విజ్ఞప్తి చేసారు. మరి వైఎస్ షర్మిల లేఖను తెలంగాణ సీఎస్ పరిగణలోకి తీసుకుంటాడో లేదో చూడాలి. పెద్ద పెద్ద నేతలే డిమాండ్స్ చేసిన వాటివైపు కన్నెత్తి చూడని కేసీఆర్ దొర షర్మిల డిమాండ్స్ వైపు చూస్తాడా అనేది అనుమానమే,,!