Bheemla Naik : సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన భీమ్లా నాయక్ ‘అడవి తల్లి మాట’ సాంగ్.. సింగర్‌ కోసం వెతుకులాట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bheemla Naik : సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన భీమ్లా నాయక్ ‘అడవి తల్లి మాట’ సాంగ్.. సింగర్‌ కోసం వెతుకులాట..!

 Authored By mallesh | The Telugu News | Updated on :5 December 2021,10:51 am

Bheemla Naik : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సరికొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’ దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. కొత్త దర్శకుడు సాగర్ కె. చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో పవన్‌కు జోడిగా నిత్యామీనన్ నటిస్తోంది. ఇక పవర్ ఫుల్ విలన్ పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. మళయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని తెలుగులో భీమ్లా నాయక్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి సాంగ్స్, ట్రైలర్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.భీమ్లా నాయక్ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను మొగిలయ్యతో పాడించగా అది దుమ్ములేపింది.

bheemla naik : యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘అడవి తల్లి మాట’..

Bheemla Naik

Bheemla Naik

 కొన్ని రోజుల వరకు ట్రెండింగ్‌లో నిలిచింది. ఓవర్ నైట్‌లోనే మొగిలయ్య స్టార్‌గా మారిపోయారు. ఏకంగా ఆర్టీసీ ఎండీ మొగిలయ్యకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ రైడ్ ఆఫర్ ఇచ్చేశారు.తాజాగా విడుదలైన ‘అడవి తల్లి మాట’ అనే సాంగ్ యూట్యూబ్‌లో తుఫాన్ సృష్టిస్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లో మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సాంగ్ పడింది ఓ సాధారణ ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ. సాహితి చాగంటి కూడా కలిసి పనిచేశారు. దీంతో దుర్గవ్వ గురించి ప్రస్తుతం వెతుకులాట ప్రారంభించారు ఫ్యాన్స్.. ఈమె మంచిర్యాల జిల్లా వాసి. పొలం పనులకు వెళ్లినప్పుడు సరదాగా జానపద పాటలు పాడుతుంటుంది.

తెలుగులోనే కాకుండా మరాఠీలోను అనేక పాఠలు పాడింది దుర్గవ్వ… గతంలో దుర్గవ్వ పాడిన ‘ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే’ అనే ఫొక్ సాంగ్ లక్షల వ్యూస్ సంపాదించింది. తాజాగా పాడిన అడవి తల్లి మాట సాంగ్ కేవలం 24 గంటల్లో 40లక్షల వ్యూస్ సాధించడంతో దుర్గవ్వ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది