Chandrababu : అప్పట్లో రాజారెడ్డి ఇప్పుడు ఆయన.. జగన్ తాతపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ ఫైర్ అవుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ తాత రాజారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిపిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ‘ఏపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరు’ పేరిట 36 గంటల నిరసన దీక్ష చేశారు. అనంతరం ఏపీలో ఉన్న పరిస్థితులు వివరించేందుకుగాను ఢిల్లీకి చవ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఏపీలోని పరిస్థితులపై వివరించారు.
అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 356 అమలు చేయాలని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతున్నదని, 356 అమలు చేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. టీడీపీ నేతల బృందంతో కలిసి చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్రపతిని కలిశారు. టీడీపీ నాయకులను అధికార వైసీపీ ప్రభుత్వం శారీరకంగా, మానసికంగా రాజకీయంగా క్షోభ పెడుతూ ఆర్థికమూలాలపై దెబ్బతీస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు. ఇకపోతే తమ సమస్యలన్నిటినీ రాష్ట్రపతి విన్నారని, న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో అరాచకాలు పెరిగిపోతే దేశ సమగ్రతకే ముప్పు వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏపీలో టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరామని వివరించారు.
Chandrababu : ఆర్టికల్ 356 అమలు చేయాలన్న చంద్రబాబు..
చంద్రబాబు.అరాచకాలకు కేరాఫ్‌గా ఏపీ కాబోతుందేమోనని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఏపీ డీజీపీపైన పలు ఆరోపణలు చేశారు. పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రితో కలిసి టీడీపీ నేతలను టార్చర్ చేస్తుందని ఫైర్ అయ్యారు. తన ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ హిస్టరీలో ఇటువంటి పాలిటిక్స్ చూడలేదని, గతంలో రాజారెడ్డి ఇలాగే చేసేవాడని, ఇప్పుడు ఆయన మనవడు జగన్ అలా చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రధాన మంత్రి మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తామని, ఇప్పటికే వారిరువురి అపాయింట్‌మెంట్స్ అడిగామని మీడియాకు చెప్పారు.