Krithi Shetty : మెడలో పూలమాలతో ‘నాగలక్ష్మి’ వచ్చేసింది.. ‘బంగార్రాజు’ నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్..
Krithi Shetty : అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ జంటగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తండ్రీ తనయులు అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ‘ఉప్పెన’ బ్యూటి కృతిశెట్టి నటస్తోంది.
Krithi Shetty : లేడీస్ ఫస్ట్ అంటూ… అభివాదం చేస్తున్న కృతిశెట్టి..
‘బంగార్రాజు’ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభం కాగా, మేకర్స్ అప్పుడే ఈ చిత్రంలోని కృతిశెట్టి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తుండగా, లేడీస్ ఫస్ట్ అనే క్యాప్షన్‌తో మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కృతిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

z naga lakshmi
సదరు ఫొటోలో కృతిశెట్టి సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో మెడలో పూల మాలతో అభివాదం చేస్తూ కనబడుతోంది. బ్లూ కలర్ శారీ విత్ మ్యాచింగ్ బ్లూ కలర్ జాకెట్‌లో స్పెడ్స్ తీస్తూ అభివాదం చేస్తూ కృతిశెట్టి అందంగా కనబడుతోంది. ఇకపోతే ట్విట్టర్ వేదికగా తనకు అవకాశం ఇచ్చిన మూవీ మేకర్స్‌కు, హీరో నాగచైతన్యకు కృతిశెట్టి థాంక్స్ చెప్పింది.