Pawan Kalyan : మందు బాటిల్ ముందర పెట్టుకుని.. తాపీగా నేల మీద కూర్చొన్న పవన్ కల్యాణ్.. ఫొటో వైరల్..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు పొలిటికల్ మీటింగ్స్‌లో పాల్గొంటూనే మరో వైపున సినిమాల్లో నటిస్తూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ పోస్టర్ ఒకటి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో అది తెగ వైరలవుతోంది.‘భీమ్లా నాయక్’ మూవీ నుంచి ఇప్పటికే ‘భీమ్లానాయక్, డానియల్ శేఖర్, లాలా భీమ్లా, అంత ఇష్టం ఏందయ్యా’ అప్‌డేట్స్ ఇచ్చేశారు మేకర్స్.

pawan kalyan bheemla nayak poster viral in social media
తాజాగా దీపావళి సందర్భంగా ‘లాలా భీమ్లా’ సాంగ్ ప్రోమోను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పవన్ కల్యాణ్ పోస్టర్ విడుదల చేశారు. సదరు పోస్టర్‌లో పవన్ కల్యాణ్ క్రేజీగా కనబడుతున్నారు. ఆరెంజ్ చొక్కాలో, లుంగీ కట్టుకుని నేల మీద కూర్చొని ముందర మందు బాటిల్ పెట్టుకుని తదేకంగా చూస్తున్నాడు. ఈ పోస్టర్ చూసి పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Pawan Kalyan : ఆరెంజ్ చొక్కాలో, లుంగీ కట్టుకుని ఆకట్టుకుంటున్న పవన్ కల్యాణ్..

pawan kalyan bheemla nayak poster viral in social media
సాగర్. కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్త ఈ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్ ఈ సినిమా పూర్తి చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో నెక్స్ట్ పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలుస్తోంది.