Pawan Kalyan : తాను చేయబోయే సినిమాలకు పవన్ కల్యాణ్ పెట్టిన కండీషన్స్ ఇవే..!
Pawan Kalyan : మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత ‘వకీల్ సాబ్’గా రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా వచ్చే నెల 25న విడుదల కానుంది. ఈ సంగతి అటుంచితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో దర్శక నిర్మాతలకు ఈ కండీషన్స్ పెట్టారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ప్రకారం..పవన్ కల్యాణ్ తాను చేయబోయే మూవీస్ ఒక్కొక్క దానికి 60 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇవ్వగలనని చెప్పాడట.
ఆ 60 రోజుల్లోనే పిక్చర్ షూటింగ్ కంప్లీట్ చేయాలని కండీషన్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంటుంది. కేవలం 60 రోజుల్లో మూవీ షూట్ కంప్లీట్ చేయడం కష్టమే ననే అభిప్రాయం అయితే ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఉంది.ఇకపోతే మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్. కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

pawan kalyan conditions forh is upcoming films
Pawan Kalyan : అటు సినిమాలు ఇటు పాలిటిక్స్..
ఈ చిత్రంలో పవన్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా, దగ్గుబాటి రానా మరో హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీ శ్ శంకర్ డైరెక్షన్‌లో ‘భవదీయుడు..! భగత్ సింగ్’ చిత్రంలో నటించనున్నారు. మరో వైపున ఇప్పటికే పీరియాడికల్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు జనసేనాని. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ అనే చిత్రం కూడా చేయనున్నారు పవన్ కల్యాణ్. ఈ పిక్చర్‌కు వక్కంతం వంశీ స్టోరి అందిస్తున్నారు.