Video : కొడుకు చదువుకోసం తెచ్చిన రూ.20లక్షలు బూడిద పాలు..
అదృష్టం ఒక్కసారి తలుపు తడితే దురదృష్టం మాత్రం తలుపు తీసేదాకా కొడుతుందని చెబుతుంటారు పెద్దలు. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయంలో అయితే దురదృష్టం ఇలా కూడా వస్తుందా అని షాక్ అనిపిస్తుంది. రెక్కల కష్టం బూడిద పాలు కావడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని గురుభట్ల గూడెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఉండే కాళ్ల క్రిష్ణవేణి అనే మహిళ తన కొడుకుతో కలిసి ఓ ఇంట్లో జీవిస్తోంది. కాగా ఆదివారం నాడు పిడుగు పడటంతో వారి ఇంటిపక్కనే ఉండే గడ్డివాము నిప్పు అంటుకుంది. అయితే ఆ మంటలు కాస్తా ఇంటికి వ్యాపించడంతో ఇళ్లు పూర్తిగా కాలిపోయింది.
A farmer family in #AndhraPradesh lost RS 20 lakh cash and gold ornaments in a lightning strike. The family had sold land and collects money for son’s education, but on sunday the house was struck by a thunderbolt. Fortunately, no one suffered any injury in the incident. pic.twitter.com/zIlkyTw3vA
— Aashish (@Ashi_IndiaToday) September 20, 2021
అయితే వారు తమ భూమి అమ్మి కొడుకు చదువు కోసం దాచిపెట్టిన రూ.20లక్షలు పూర్తిగా కాలిపోయాయి. ఇక స్థానికులు ఎంత ప్రయత్నించినా మంటలను ఆర్పలేకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.