Guppedantha Manasu 8 Dec Today Episode : దేవయానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వసుధార.. రిషి ఎక్కడికెళ్లాడో ఇంకా తెలియలేదు.. అసలు బతికే ఉన్నాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 8 Dec Today Episode : దేవయానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వసుధార.. రిషి ఎక్కడికెళ్లాడో ఇంకా తెలియలేదు.. అసలు బతికే ఉన్నాడా?

Guppedantha Manasu 8 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు సీరియల్ 8 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 941 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనుపమ, మహీంద్రా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ముకుల్ వస్తాడు. అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దీంతో మేము నిన్న ఆసుపత్రికి వచ్చాం. ఆసుపత్రికి వచ్చినట్టే వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అంటాడు మహీంద్రా. మరి.. ఈ విషయం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :8 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  జగతి హత్య కేేసులో శైలేంద్ర ప్రధాన నిందితుడు అని తెలుసుకున్న అనుపమ

  •  శైలేంద్రను డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు

  •  శైలేంద్రను ముకుల్ విచారిస్తాడా?

Guppedantha Manasu 8 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు సీరియల్ 8 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 941 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనుపమ, మహీంద్రా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ముకుల్ వస్తాడు. అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దీంతో మేము నిన్న ఆసుపత్రికి వచ్చాం. ఆసుపత్రికి వచ్చినట్టే వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అంటాడు మహీంద్రా. మరి.. ఈ విషయం నిన్న ఆసుపత్రికి వచ్చినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అంటే.. నిన్న అలాగే మెసేజ్ చేశాడు.. సాయంత్రం అయినా రాకపోయేసరికి అప్పుడు అసలు విషయం అర్థం అయింది అంటాడు మహీంద్రా. జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చాలా అనుమానాస్పదంగా అనిపిస్తోంది. మీ ఫ్యామిలీలో పెద్ద కుట్రే జరుగుతోంది. అది ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. శైలేంద్ర మీద అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకునే సమయానికే ఆయన మీద అటాక్ జరగడం, ఆ తర్వాత రిషి కనిపించకుండా పోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది అంటాడు ముకుల్. దీంతో శైలేంద్ర మీద అనుమానం ఏంటి అంటే జగతి మేడమ్ హత్య కేసులో శైలేంద్ర ప్రధాన నిందితుడు అని చెబుతాడు ముకుల్. దీంతో అనుపమ షాక్ అవుతుంది. శైలేంద్ర డిశ్చార్జ్ అయి బయటికి వచ్చాక ఆయనతో మాట్లాడితేనే చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది అని అంటాడు ముకుల్. ఒకసారి శైలేంద్ర కండిషన్ నాకు చెప్పండి అని మహీంద్రతో అంటాడు ముకుల్. దీంతో సరే.. నేను ఇప్పుడే ఆసుపత్రికి వెళ్తున్నా.. వెళ్లగానే చెప్తా అంటాడు మహీంద్రా.

మరోవైపు రిషిని వెతుకుతూ స్కూటీ మీద వెళ్తుంటుంది వసుధార. ఇంతలో ఆసుపత్రికి అనుపమ, మహీంద్రా వస్తారు. అనుపమను చూసి షాక్ అవుతుంది దేవయాని. ఈమె వచ్చిందేంటి అని అనుకుంటుంది. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు మీ అబ్బాయిని అని అంటుంది అనుపమ. దీంతో అదేంటి అనుపమ.. మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడగకుండా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు అని అడుగుతున్నావు అని అంటుంది. దీంతో నేను బాగున్నావా అని అడిగితేనే బాగుంటాడా.. ముందు డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తా అన్నారో చెప్పండి అంటే వాళ్లు క్లారిటీగా చెప్పడం లేదు అని అంటుంది దేవయాని. దీంతో మీరు క్లారిటీగా అడిగి ఉండరు అంటుంది అనుపమ. వెళ్లి డాక్టర్ ను కలిసి మాట్లాడుతుంది అనుపమ. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటే మధ్యాహ్నం తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చు అంటాడు డాక్టర్. దీంతో సరే అంటుంది అనుపమ. ఇంతలో రవీంద్రా వచ్చి మహీంద్రా ఏంటి డల్ గా ఉన్నావు ఏమైంది అంటే రిషి కనిపించడం లేదు కదా.. కొంచెం కంగారు పడుతున్నాడు అని అంటుంది అనుపమ. అదేంటి.. రాత్రి కూడా ఇంటికి రాలేదా అంటాడు. దీంతో రాలేదు అన్నయ్య అంటాడు మహీంద్రా.

Guppedantha Manasu 8 Dec Today Episode : రిషి ఇంకా ఇంటికి రాలేదని యాక్షన్ స్టార్ట్ చేసిన దేవయాని

ఏంటి రిషి ఇంకా ఇంటికి రాలేదా.. దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి. నా ఇద్దరు బిడ్డలను ఇలా చేశావు ఏంటయ్యా అని అంటుంది దేవయాని. ఉదయం నేను లేచేసరికి ఇంట్లో కూడా లేదు వసుధార. రిషి కోసం ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు మహీంద్రా. రిషి కొన్ని విషయాల్లో అలాగే ఉంటాడు కదా అంటాడు రవీంద్ర. మరోవైపు మహీంద్రాకు ఫోన్ వస్తుంది. వసుధార ఫోన్ చేస్తుంది. దీంతో పక్కకు వెళ్లి లిఫ్ట్ చేస్తాడు. మామయ్య ఎక్కడున్నారు అంటే.. ఆసుపత్రికి వచ్చాం అంటాడు. రిషి సార్ గురించి ఏమైనా తెలిసిందా అంటే తెలియలేదు అంటాడు.

నేను సార్ కు తెలిసిన వాళ్లు, లెక్చరర్స్ అందరికీ కాల్ చేశాను. ఎవ్వరికీ తెలియదు అంటున్నారు అంటుంది వసుధార. నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం ముకుల్ కు చెప్పాను. ఆయన సెర్చ్ చేస్తా అన్నారు. శైలేంద్రను మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తా అన్నారు. నువ్వు డైరెక్ట్ గా అన్నయ్య వాళ్ల ఇంటికి వచ్చేయ్ అంటాడు మహీంద్రా. దీంతో సరే అంటుంది వసుధార.

ఆ తర్వాత శైలేంద్రను డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి తీసుకొస్తారు. మీరేం టెన్షన్ పడకండి. అందరం కలిసి రిషిని వెతుకుదాం అంటాడు రవీంద్రా. వసుధారను వెళ్లి దిష్టి తీయమంటారు. దీంతో వెల్లి వసుధార దిష్టి తీస్తుంది. శైలేంద్ర నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దిష్టి తీయమ్మా అంటుంది దేవయాని. దీంతో దిష్టి తీస్తుంది వసుధార. ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన నువ్వు, దేవత లాంటి జగతి మేడమ్ ను పొట్టన పెట్టుకున్న నువ్వు మట్టికొట్టుకుపోతావ్ అని మనసులో అనుకుంటుంది వసుధార.

ఆ తర్వాత రిషి ఇంకా రాలేదా.. కొంపదీసి జగతికి జరిగినట్టు రిషికి కూడా ఏమైనా జరిగిందా అని వసుధారతో అంటుంది దేవయాని. దీంతో మేడమ్ అంటూ చేయి ఎత్తుతుంది వసుధార. మా మేడమ్ నేర్పిన సంస్కారం కాబట్టే ఈ చేయి ఇక్కడే ఆగిపోయింది. లేదంటేనా ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడినా కానీ నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నా భర్త గురించి ఇంకోసారి అపశకునంగా మాట్లాడినా.. ఏమాత్రం కీడుగా మాట్లాడినా నేను ఊరుకోను మేడమ్. నన్ను ఏమన్నా తట్టుకుంటా కానీ.. నా భర్తను అంటే తట్టుకోలేను జాగ్రత్త. అయినా మీకు ఎంతో కాలం లేదులే. ముకుల్ గారు వస్తున్నారు. మీరు కూడా విన్నారు కదా. ఈ మధ్యలో ఏవేవో డ్రామాలు ఆడి వాయిదా వేసినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు. ఖచ్చితంగా మీరు మీ కొడుకు శిక్ష అనుభవించే టైమ్ దగ్గర పడింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుదార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది