Guppedantha Manasu 15 Nov Today Episode : జగతి చనిపోయిన విషయం తెలిసి కుప్పకూలిన అనుపమ.. అసలు ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? మహీంద్రాకి, అనుపమకు మధ్య ఏం ఉంది?
ప్రధానాంశాలు:
జగతి చనిపోయింది అని అనుపమకు చెప్పిన మహీంద్రా
జగతి చావుకు నువ్వే కారణం అన్న అనుపమ
అమ్మ చావుకు కారణం నాన్న కాదు అన్న రిషి
Guppedantha Manasu 15 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 15 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 921 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి చనిపోయింది అనే విషయాన్ని అనుపమ జీర్ణించుకోలేకపోతుంది. జగతి చనిపోలేదు అని చెప్పు మహీంద్రా అంటే.. లేదు జగతి చనిపోయింది అనుపమ అంటాడు మహీంద్రా. తను నాకు దూరం అయిపోయింది అంటాడు మహీంద్రా. దీంతో అనుపమ తట్టుకోలేకపోతుంది. మరి నాకెందుకు చెప్పలేదు. జగతి చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటుంది అనుపమ. ఎందుకు దాచావు మహీంద్రా అంటుంది అనుపమ. మనం ఎంత ప్రాణ స్నేహితులం కదా. జగతికి ఏదైనా అయితే తట్టుకోలేనని నీకు తెలుసు కదా. మరెందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది అనుపమ. చెప్పు మహీంద్రా. నువ్వే చంపావు కదా అంటుంది అనుపమ. దీంతో మహీంద్రా షాక్ అవుతాడు. నువ్వే చంపేశావా అంటుంది. నువ్వు తనను దగ్గరకు తీయలేదనే బాధతోనే తను చనిపోయిందా? చెప్పు. తనకు నీ ప్రేమను దక్కనీయకుండా నువ్వే చంపేశావా? నా జగతిని చంపేశావు మహీంద్రా అంటుంది అనుపమ. అంతగా ప్రేమించి ఎలా వదిలేయగలిగావు. ఎలా దూరం కాగలిగావు. అందుకే తన ప్రాణం పోవడానికి నువ్వే కారణం అయ్యావు అంటుంది అనుపమ.
చెప్పు మహీంద్రా.. చెప్పు అంటుంది. మా అమ్మ చనిపోవడానికి కారణం నాన్న కాదు మేడమ్ అంటాడు రిషి. మీరు అనుకున్నట్టు జరిగిన దాంట్లో డాడ్ తప్పేమీ లేదు అంటాడు రిషి. ఆయన అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. అపురూపంగా చూసుకున్నారు అంటాడు రిషి. కానీ.. మా తలరాత అడ్డం తిరిగింది. కాలం మా మీద పగబట్టి అమ్మను తీసుకెళ్లింది. నన్ను కాపాడుకునే క్రమంలో ఆవిడ ప్రాణాలు విడిచారు అని చెబుతాడు రిషి. మా అమ్మ కోరిక తీర్చడం కోసం మా మధ్య ఉన్న దూరం పక్కన పెట్టి మేమిద్దరం ఒక్కటయ్యాం. మా దురదృష్టం.. దేవత లాంటి అమ్మను దూరం చేసుకున్నాం అంటాడు రిషి. నా కోసం తను ప్రాణాలనే పణంగా పెట్టి దూరం అయిపోయింది. డాడ్.. రండి వెళ్దాం అంటాడు రిషి. దీంతో అనుపమ ఏం మాట్లాడదు. ఏంటి విశ్వం.. ఏం జరుగుతోంది అని అడుగుతుంది ఏంజెల్.
Guppedantha Manasu 15 Nov Today Episode : అనుపమను ఓదార్చిన విశ్వం, ఏంజెల్
మరోవైపు రిషి, మహీంద్రా కారులో వెళ్తుంటారు. రిషి.. ఒకసారి బండి ఆపవా అంటాడు మహీంద్రా. దీంతో ఎందుకు డాడ్ అంటాడు. ప్లీజ్ ఒక్కసారి బండి ఆపు అంటాడు మహీంద్రా. దీంతో సరే అంటాడు రిషి. రోడ్డు పక్కన బండి ఆపుతాడు రిషి. బయటికి వచ్చి గట్టిగా అరుస్తాడు మహీంద్రా. డాడ్.. ఎమోషనల్ అవ్వకండి. కంట్రోల్ చేసుకోండి అంటాడు.
చూశావా అనుపమ ఎంత బాధపడుతోందో.. అనుపమ తట్టుకోలేకపోతోంది జగతి. నేనే నీ చావుకు కారణం అయ్యానేమో అని నన్ను నిలదీసింది. నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు అని అంటాడు. అసలు ఈ అనుపమ ఎవరు మామయ్య.. అని అడుగుతుంది వసుధార. దీంతో తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటాడు మహీంద్రా. అనుపమకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం. మీ అమ్మ కోసం అనుపమ ఎంతో చేసింది. మీ అమ్మను కంటికి రెప్పలా కాపాడుకునేది అని చెబుతాడు మహీంద్రా.
నేను, మీ అమ్మ ప్రేమించుకుంటున్నాం అని తెలిసి మా ప్రేమకు సపోర్ట్ చేసింది. మా ప్రేమను ఇంట్లో అంగీకరించకున్నా.. అందరినీ ఎదిరించి మరీ మా పెళ్లి చేసింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్లిందో తెలియదు. మేము తన కోసం చాలా వెతికాం. ఇప్పుడు జగతి లేదని తెలిసి గుండె పగిలిపోయేలా ఏడ్చింది అనుపమ. ఇప్పుడు తను ఏం అనుకుంటుందో తెలియదు. మా స్నేహం ముక్కలు అయినట్టేనా అని అంటాడు మహీంద్రా. మీ స్నేహం ఏం ముక్కలు కాదు. మీరు ఎప్పటిలాగానే ఉంటారు. ప్లీజ్ మామయ్య పదండి అంటుంది వసుధార. ఆ తర్వాత అందరూ కలిసి కారులో వెళ్తారు.
మరోవైపు అనుపమ.. జగతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. నువ్వు ఇలా అందరినీ వదిలేసి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావు ఏంటి జగతి ఇది. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అనుకుంటుంది. ఇంతలో అక్కడికి విశ్వం, ఏంజెల్ వస్తారు. అమ్మ.. అనుపమ.. ఏమైందమ్మా అంటాడు విశ్వం.
ఇప్పుడు నా మనసు బాగోలేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంది అనుపమ. జగతి గురించి బాధపడుతున్నావా? రిషి వాళ్లు ఆ విషయం చెబుతున్నప్పుడు నేను విన్నాను అంటాడు విశ్వం. తను చాలా మంచి మనిషి. కానీ.. తను ఈ రోజు మన మధ్య లేదంటే నేనూ నమ్మలేకపోతున్నాను అంటాడు విశ్వం.
అసలు నేను ఈ ఫంక్షన్ చేసేదే జగతిని కలుసుకోవడం కోసం. తనతో మనసారా మాట్లాడటం కోసం. కానీ.. ఇప్పుడు నేను తట్టుకోలేని నిజం తెలిసిపోయింది. ఆ మాట వినగానే ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది అంటుంది అనుపమ. జగతి లేదనే విషయం మహీంద్రా నా దగ్గర ఎందుకు దాచిపెట్టాడో అర్థం కావడం లేదు అంటుంది అనుపమ.
మహీంద్రా నా ఫ్రెండే కదా.. నాకు చెప్పకుండా ఎలా ఉంటాడు. అసలు ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచాడు. అసలు జగతిని ఎవరు చంపారు. జగతిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. ఇది జరిగి చాలా రోజులు అయింది అంటున్నారు కానీ.. ఇప్పటి వరకు ఆ హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు. అంటే.. జగతి గురించి వాళ్లు అంత ఈజీగా తీసుకుంటున్నారా? అంటుంది అనుపమ.
లేదు అత్తయ్య. రిషి ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోడు అంటుంది ఏంజెల్. అంత నమ్మకంగా చెబుతున్నావు ఏంటి.. రిషి గురించి నీకు అంత బాగా తెలుసా? అంటే.. తెలుసు అత్తయ్య అంటుంది ఏంజెల్. జగతి మేడమ్ మన ఇంటికి కూడా వచ్చారు అంటుంది ఏంజెల్. ఆమెతో మాట్లాడుతుంటే సొంత మనిషితో మాట్లాడినట్టుగా అనిపించేది అంటుంది ఏంజెల్.
మహీంద్రా అప్పటికి ఇప్పటికి బాగా మారిపోయాడు.. అంటాడు విశ్వం. మహీంద్రా వల్లనే కదా ఆరోజుల్లో నువ్వు.. అంటూ విశ్వం ఏదో చెప్పబోతుండగా గతం గురించి వద్దు డాడ్ అంటుంది అనుపమ. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకోవడం వల్ల ఏం లాభం ఉండదు. మనసుకు కష్టం కలగడం తప్ప అంటుంది అనుపమ.
అసలు ఏం జరిగింది అని అడుగుతుంది ఏంజెల్. మీ మేనత్త జీవితం, నీ జీవితం ఒకేలా ఉన్నాయి అంటాడు విశ్వం. మహీంద్రా నా దగ్గర ఈ విషయం దాచి పెడతాడని నేను అస్సలు ఊహించలేదు అని మనసులో అనుకుంటుంది అనుపమ. అత్తయ్య.. జగతి మేడమ్ చనిపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. మీరు బెంగపెట్టుకోకండి. ధైర్యంగా ఉండండి అంటుంది ఏంజెల్.
మరోవైపు రిషి ఎక్కడున్నాడని చూస్తుంది వసుధార. ఇంతలో కిచెన్ లో కూరగాయలు కోస్తూ ఉంటాడు. ఎవరి పనులు వాళ్లు చేస్తే బాగుంటుంది అంటుంది వసుధార. వంట పనులు చేస్తే తప్పేంటి అంటాడు రిషి. నేను ఈరోజు వండుతాను అంటాడు రిషి. ఎందుకు సార్ ఇదంతా అంటుంది వసుధార. అయినా వినకుండా రిషి వంట చేస్తా అంటాడు. ఎక్కడ ఏ సామాన్లు ఉన్నాయో చూపిస్తుండగా బియ్యం ఇద్దరి మీద పడతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.