Guppedantha Manasu 27 Nov Monday Episode Highlights : చిత్ర ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి నిజంగా వసుధారే కారణమా? అసలు నిజాలు ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 27 Nov Monday Episode Highlights : చిత్ర ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి నిజంగా వసుధారే కారణమా? అసలు నిజాలు ఏంటి?

Guppedantha Manasu 27 Nov Monday Episode Highlights : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 27 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 931 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార తప్పు చేయలేదు అని రిషి ఎంత చెప్పినా పోలీసులు వినరు. చిత్ర పేరెంట్స్ కూడా వసుధార వల్లనే చిత్ర ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పడంతో ఇక పోలీసులు తనను వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తూ […]

 Authored By gatla | The Telugu News | Updated on :26 November 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  చిత్ర పేరెంట్స్ కూడా వసుధార వల్లనే చిత్ర ఆత్మహత్యాయత్నం చేసుకుందని అంటారు

  •  వసుధారకు అనుపమ ఎందుకు బెయిల్ ఇప్పించింది

  •  చిత్ర దేవుడి దగ్గరికి వెళ్లకూడదని మీరు కోరుకోండి అని చెప్పిన అనుపమ

Guppedantha Manasu 27 Nov Monday Episode Highlights : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 27 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 931 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార తప్పు చేయలేదు అని రిషి ఎంత చెప్పినా పోలీసులు వినరు. చిత్ర పేరెంట్స్ కూడా వసుధార వల్లనే చిత్ర ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పడంతో ఇక పోలీసులు తనను వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా అనుపమ ఎదురవుతుంది. నీకు ఇది న్యాయంగా ఉందా అని అడుగుతుంది. మీరు ఒక ఆడపిల్ల అయి ఉండి.. సాటి ఆడపిల్ల చావుకు కారణం అయినందుకు బాధగా లేదా అని అడుగుతుంది. కాలేజీ పరువు ప్రతిష్ఠలకోసం ఒక అమ్మాయి ప్రాణాలు బలిపెడతారా? ఇది మీకు సవ్యంగా ఉందా? ఎండీ సీటులో కూర్చొనే ముందు దానికి దగ్గ అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి కదా అంటుంది అనుపమ. దీంతో అసలు చిత్ర ఆత్మహత్యయత్నానికి, వసుధారకు అస్సలు సంబంధం లేదు అంటాడు రిషి. అయితే.. ఆ టైమ్ లో వసుధార ఎందుకు వాళ్ల ఇంటికి వెళ్లింది అంటే.. ప్లీజ్ హెల్ప్ మీ అని మెసేజ్ పెడితే వెళ్లాను అంటుంది వసుధార. దీంతో అయితే ఆ మెసేజ్ చూపించండి అంటుంది అనుపమ. ఆ మెసేజ్ ఫోన్ లో డిలీటెడ్ అని ఉంటుంది. దీంతో అనుపమ.. వసుధారను నమ్మదు. ఇదంతా మీరే క్రియేట్ చేశారు. తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి నువ్వే కారణం అంటంది అనుపమ.

లేదు అన్నా కూడా వినదు అనుపమ. సార్.. ఇంకా చూస్తారేంటి సార్.. స్టేషన్ కు తీసుకెళ్లండి అంటుంది అనుపమ. పదండి మేడమ్ అంటారు పోలీసులు. ఎంత చెప్పినా వినకుండా పోలీసులు తనను జీపులో తీసుకెళ్తారు. దీంతో వెంటనే కారులో రిషి, మహీంద్రా పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతారు. ఇంతలో వసుధార ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అంటుంది అనుపమ. ఒక ఎండీ స్థాయికి వెళ్లిందంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయని అనుకున్నా కానీ.. ఇలా ప్రేమికుల విషయంలో జోక్యం చేసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. జగతి పేరు తీస్తోంది.. అంటూ అనుపమ సీరియస్ అవడంతో మేడమ్ ఆపుతారా అంటాడు రిషి. ఇంకోసారి ఇలా మీరు మాట్లాడొద్దు అంటాడు. దీంతో నేను ఊరికే అనడం లేదు కదా అంటుంది అనుపమ. చూడండి మేడమ్.. మనం చూసిందే సత్యం, మనకు తెలిసిందే సర్వం అనుకోవడం మూర్ఖత్వం. వసుధార గురించి మాకు తెలుసు. వసుధార స్టూడెంట్ నుంచి ఎండీ స్థాయికి ఎదిగింది. తన గ్రాఫ్ చూస్తే అర్థం అవుతుంది.. అంటాడు రిషి. తనను అవమానిస్తే జగతిని అవమానించినట్టే అంటాడు రిషి.

Guppedantha Manasu 27 Nov Monday Episode Highlights : వసుధారకు బెయిల్ ఇప్పించిన అనుపమ

ఆ తర్వాత ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతారు. తమకు తెలిసిన పోలీసులకు ఫోన్ చేస్తారు కానీ.. ఎవ్వరూ స్పందించరు. ఆ కేసులో మేము ఇన్వాల్వ్ కాలేం అంటారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్తారు ఇద్దరూ. బెయిల్ ఇప్పిస్తాం వసుధారను వదిలేయండి అన్నా కూడా పోలీసులు వదలరు. తన తప్పు లేదు అన్నా కూడా వినరు. దీంతో వసుధారకు బెయిల్ ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉండగా.. ఇంతలో ఒక లాయర్ వచ్చి వసుధారకు బెయిల్ ఇప్పిస్తాడు.

దీంతో ఎవరు సార్ మీరు అంటే.. అనుపమ తనను పంపించింది అంటాడు. ఆ తర్వాత వసుధారను తీసుకొని బయటికి వెళ్లగానే అక్కడ అనుపమ ఉంటుంది. మీరే చెప్పారు కదా.. వసుధారను అనుమానిస్తే జగతిని అనుమానించినట్టే అని.. అందుకే తనకు బెయిల్ ఇప్పించా అంటుంది అనుపమ.

దీని వెనుక ఎవరో కుట్ర ఉంది అంటాడు రిషి. దీంతో కుట్ర ఉంది అని అనుకుంటే నిరూపించుకోవాలి అంటుంది అనుపమ. రేపు నిజానిజాలు చేసిన తర్వాత మీరే పశ్చాత్తాప పడతారు. తను ఏ తప్పు చేయలేదని.. జరిగిన దాంట్లో తన తప్పేం లేదని నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడు మీరు తలదించుకోవాల్సి వస్తుంది అంటాడు రిషి. దీంతో బెయిల్ మీద బయటికి వచ్చిన వాళ్లు అందరూ నిర్దోషులు కాదు రిషి అంటుంది అనుపమ. అలాగే.. జైలులో ఉన్నవాళ్లు కూడా అందరూ దోషులు కాదు అంటాడు రిషి.

మనం వసుధారను నమ్మినంతగా అందరూ నమ్మాలని లేదు కదా రిషి అంటాడు మహీంద్రా. సరే అనుపమ నీ మనసులో ఏ ఉద్దేశం ఉన్నా చేసిన సాయానికి థాంక్స్ అంటాడు మహీంద్రా. దీంతో నేను సాయం అనుకోను. ఒక చిన్న సపోర్ట్. ఎంత పెద్ద క్రిమినల్ కు అయినా తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కావాలి. ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మీరు దేవుడిని వేడుకోవాల్సింది ఒక్క విషయంలోనే.

చిత్ర దేవుడి దగ్గరికి వెళ్లకూడదని మీరు కోరుకోండి. ఎందుకంటే తను ఇచ్చే స్టేట్ మెంట్స్ మీదే వసుధార జీవితం  ఆధారపడి ఉంటుంది.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనుపమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది