Guppedantha Manasu 4 Dec Today Episode : శైలేంద్రను ముకుల్ విచారిస్తాడా.. అసలు నిజం తెలుస్తుందా? రిషి ఎక్కడికి వెళ్లాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 4 Dec Today Episode : శైలేంద్రను ముకుల్ విచారిస్తాడా.. అసలు నిజం తెలుస్తుందా? రిషి ఎక్కడికి వెళ్లాడు?

Guppedantha Manasu 4 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 4, 2023, సోమవారం ఎపిసోడ్ 937 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి సార్ మీ కొడుకు అని వెనుకడుగు వేస్తున్నారా అని రవీంద్రను అడుగుతాడు ముకుల్. దీంతో మీకు నేను ఇప్పటికే ఇంట్లోనే చెప్పాను కదా. నా కొడుకు గానీ తప్పు చేశాడని తెలిస్తే వాడిని అస్సలు వదిలిపెట్టే సమస్యే […]

 Authored By gatla | The Telugu News | Updated on :4 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  శైలేంద్రను విచారించేందుకు ఐసీయూ లోపలికి వెళ్లిన ముకుల్

  •  ముకుల్ పై దేవయాని సీరియస్

  •  రిషి ఎక్కడికి వెళ్లాడు అని మండిపడ్డ దేవయాని

Guppedantha Manasu 4 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 4, 2023, సోమవారం ఎపిసోడ్ 937 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి సార్ మీ కొడుకు అని వెనుకడుగు వేస్తున్నారా అని రవీంద్రను అడుగుతాడు ముకుల్. దీంతో మీకు నేను ఇప్పటికే ఇంట్లోనే చెప్పాను కదా. నా కొడుకు గానీ తప్పు చేశాడని తెలిస్తే వాడిని అస్సలు వదిలిపెట్టే సమస్యే లేదు అని చెప్పాను కదా అంటాడు రవీంద్ర. వాడి పరిస్థితి ఇప్పుడు బాగోలేదు కాబట్టి నేను అలా అంటున్నా. నా కొడుకు అని కాదు. వాడి ప్లేస్ లో ఎవరు ఉన్నా ఒకేలా ఆలోచిస్తా నేను అంటాడు రవీంద్రా. ఇప్పటికే ఆడియో వాయిస్ ఆధారంగా ఉంది. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే నిజమైన నిందితులు ఎవరో తెలుస్తుంది అంటాడు ముకుల్. దీంతో అర్థమయింది ముకుల్ గారు. నాకు కొంచెం టైమ్ ఇవ్వండి అంటాడు రవీంద్ర. మరోవైపు దేవయాని శైలేంద్ర రూమ్ కు వెళ్తుంది. నాన్న శైలేంద్ర ఏమైంది అని అడుగుతుంది.

అప్పుడే కళ్లు తెరిచినట్టు యాక్షన్ చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న. ఇప్పుడు బాగానే ఉంది కదా. ఏం కాలేదు కదా అంటుంది. తన ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాడు శైలేంద్ర. నిజం చెప్పు నాన్న బాగుంది కదా అంటే ఊరికే అడిగిందే అడిగి విసిగించకు మామ్. మాట్లాడటం కూడా కష్టంగా ఉంది. లోపల సలసలమని మండుతోంది అంటే.. కొబ్బరి బోండాం ఏమైనా తాగుతావా నాన్న తీసుకురానా అంటే.. కొబ్బరి బోండాలతో తగ్గే మంట కాదు మామ్. కాసేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా అంటాడు శైలేంద్ర. అసలు ఏం జరిగింది. నిన్ను పొడిచింది ఎవరు అని అడుగుతుంది. పొడిచినోడు ఎవడో కానీ కరెక్ట్ గా భలే పొడిచాను. మంచి ట్రెయినింగ్ తీసుకున్నట్టున్నాడు. కర్ర విరిగింది కానీ పాము చావలేదు అన్నట్టు.. కత్తి దిగింది కానీ ప్రాణం అయితే పోలేదు. కరెక్ట్ గా లెక్క చూసి పొడిచాడు అంటాడు. దీంతో అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. నీకో విషయం తెలుసా నాన్న. నువ్వు జగతిని చంపమని ఆ షూటర్ తో మాట్లాడిన ఆడియో బయటికి వచ్చింది అని చెబుతుంది దేవయాని. దాన్ని అందరికీ వినిపించాడు అని చెబుతుంది దేవయాని.

Guppedantha Manasu 4 Dec Today Episode : ముకుల్ ను ఇక్కడి నుంచి పంపించేయాలని దేవయానితో చెప్పిన శైలేంద్ర

అసలు నిన్ను పొడిచిన వాళ్లు ఎవరు.. వాళ్లకు నీకు శతృత్వం ఏంటి అని అడుగుతుంది. దీంతో నువ్వు ఎక్కువగా కంగారు పడకు. అసలు ఇదంతా అంటూ ఏదో మాట్లాడబోతుండగా ముకుల్ కనిపిస్తాడు. దీంతో వెంటనే మాస్క్ పెట్టుకుంటాడు శైలేంద్ర. మాస్క్ పెట్టుకొని యాక్షన్ చేస్తుంటాడు. దీంతో నువ్వు కళ్లు మూసుకొని పడుకో. నేను ఏదో ఒకటి చేసి అతడిని పంపించేసి వస్తా అంటుంది దేవయాని. బయటికి వచ్చి ఏంటండి మాట్లాడేది.. వాడు ఒక పక్క చావు బతుకుల మధ్య ఉంటే మీరు ఇప్పుడు మాట్లాడుతా అంటారేంటి అంటూ సీరియస్ అవుతుంది దేవయాని. దీంతో నేనేం ఇబ్బంది పెట్టను. అతడికి ఎంత మాట్లాడటానికి వీలైతే అంత మాట్లాడు అంటాడు ముకుల్. దీంతో నేను ఇప్పటి వరకు ఎంతో ట్రై చేశాను. కానీ.. వాడు మాట్లాడటం లేదు అంటుంది దేవయాని.

దీంతో మీరు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. జగతి హత్య కేసులో మీ అబ్బాయే ప్రధాన నిందితుడు అంటాడు ముకుల్. దీంతో ఎవరో మిమిక్రీ చేసిన వీడియోను పట్టుకొని మా అబ్బాయి మీద నిందలు వేస్తున్నారు. ఇప్పుడు మీరు వాడిని ఇంటరాగేషన్ పేరుతో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటుంది దేవయాని. ఇక్కడ ఇంత జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారు ఏంటి.. మన కొడుకు తప్పు చేశాడంటే మీరు నమ్ముతున్నారా? నమ్మడం లేదు కదా. తనకు రిషి అన్నా, మహీంద్రా అన్నా ఎంతో ఇష్టం. అలాంటిది పిన్ని విషయంలో అలా చేస్తాడా? ఇప్పుడు మనం వాడిని అలా అడిగితే తట్టుకుంటాడా? లేడు కదా అని అంటుంది దేవయాని. దీంతో ముకుల్ గారు.. శైలేంద్ర కోరుకున్నాక నేనే ఎంక్వయిరీకి తీసుకొస్తాను అంటాడు రవీంద్ర. దీంతో ఒక్కసారి నన్ను వెళ్లనివ్వండి.. వీలు కుదిరితేనే మాట్లాడుతాను అంటాడు ముకుల్.

అసలు రిషి ఏడి అని అడుగుతుంది దేవయాని. దీంతో ఏదో పని మీద బయటికి వెళ్లాడట అంటాడు రవీంద్ర. అసలు రిషి ఉంటే ఇంత జరగనిచ్చేవాడే కాదు అంటుంది దేవయాని. ఏదైనా ఉంటే ముందే చూసుకోవచ్చు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది దేవయాని. దీంతో శైలేంద్రను చూసి కండిషన్ తెలుసుకొని మాత్రమే మాట్లాడటానికి ప్రయత్నిస్తా అని అంటున్నాడు కదా అంటాడు మహీంద్రా. దీంతో మహీంద్రా, రవీంద్రా, దేవయాని.. అందరూ లోపలికి వెళ్తారు.

శైలేంద్రకు అయిన గాయం చూస్తాడు ముకుల్. శైలేంద్ర రిపోర్ట్స్ కూడా చూస్తాడు. తర్వాత శైలేంద్ర గారు అంటూ పిలుస్తాడు. కొంచెం ఓపిక తెచ్చుకొని కళ్లు తెరిచి చూస్తాడు శైలేంద్ర. ఎవరు అటాక్ చేశారు.. అని అడుగుతాడు ముకుల్. ఏం చెప్పలేకపోతాడు శైలేంద్ర. మీకు నేను ఒక వాయిస్ వినిపిస్తాను. అది మీదో కాదో చెప్పండి అంటాడు ముకుల్.

ఏదో ఒకటి చేసి ఈ టాస్క్ ఇంతటితో ఆపేయాలి అని అనుకుంటాడు శైలేంద్ర. వెంటనే ఊపిరి ఆడనట్టుగా యాక్షన్ చేస్తాడు శైలేంద్ర. దీంతో డాక్టర్ వచ్చి అందరినీ బయటికి పంపించేస్తాడు. దీంతో వెంటనే డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. దీంతో శైలేంద్ర సైలెంట్ అయినట్టుగా చేస్తాడు.

ఇంటరాగేషన్ తర్వాత చేసుకోమని చెప్పండి.. వెళ్లమని చెప్పండి అంటుంది దేవయాని. మీ ఇంటరాగేషన్ వాయిదా వేసుకోండి అని డాక్టర్ కూడా ముకుల్ కు చెబుతాడు. తను కొంత వరకు కోలుకున్న తర్వాత చేయండి అంటాడు. మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఇంటరాగేషన్ చేయలేరు. తర్వాత లోతుగా చేయొచ్చు. డిశ్చార్జ్ అయిన తర్వాత చేయండి అంటాడు మహీంద్రా. దీంతో సరే.. తను డిశ్చార్జ్ అయిన తర్వాతనే ఇంటరాగేషన్ చేస్తాను. ఆయన మీద జరిగిన అటాక్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మళ్లీ కలుస్తాను. రిషి గారు వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి అంటాడు ముకుల్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది