Intinti Gruhalakshmi 8 Dec Today Episode : లాస్యకు దగ్గరవుతున్న నందు.. దివ్యకు ఏమైంది.. సేఫేనా? కడుపులో బిడ్డ సేఫా కాదా.. రాజ్యలక్ష్మి అసలు ప్లాన్ ఏంటి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : లాస్యకు దగ్గరవుతున్న నందు.. దివ్యకు ఏమైంది.. సేఫేనా? కడుపులో బిడ్డ సేఫా కాదా.. రాజ్యలక్ష్మి అసలు ప్లాన్ ఏంటి?

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి8 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1122 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను ఆసుపత్రికి తీసుకెళ్తుంది ప్రియ. పొరపాటున మిస్ క్యారింగ్ అయ్యే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. లోపల పెయిన్ గా ఉంది. నా కడుపులో బిడ్డను సేవ్ చేయండి డాక్టర్ అంటుంది దివ్య. అర్జెంట్ గా ఐసీయూకు తీసుకెళ్లండి అని అంటాడు డాక్టర్. తనకు […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  దివ్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రియ

  •  ఆసుపత్రికి వెళ్లిన రాజ్యలక్ష్మి

  •  నందుపై మరోసారి చిరాకు పడ్డ తులసి

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి8 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1122 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను ఆసుపత్రికి తీసుకెళ్తుంది ప్రియ. పొరపాటున మిస్ క్యారింగ్ అయ్యే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. లోపల పెయిన్ గా ఉంది. నా కడుపులో బిడ్డను సేవ్ చేయండి డాక్టర్ అంటుంది దివ్య. అర్జెంట్ గా ఐసీయూకు తీసుకెళ్లండి అని అంటాడు డాక్టర్. తనకు సీరియస్ గా ఉందని ప్రియ వెంటనే విక్రమ్ కు కాల్ చేయబోతే అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి ఫోన్ లాక్కుంటుంది. మీరు చేసేది చాలా తప్పు అత్తయ్య అంటే.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నారు కదా.. తప్పును తప్పుతోనే సరిచేయాలి. విక్రమ్ కు దివ్యను ఇచ్చి పెళ్లి చేసి చాలా తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పును సరిచేసుకుంటున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. దివ్యకు దివ్య ప్రాణాలు ఎంత ముఖ్యమో.. విక్రమ్ నా మాటలు వింటూ నా చెప్పు చేతుల్లో ఉండటం నాకు అంతే ముఖ్యం. అందుకు నీ ప్రియమైన అక్క అడ్డుపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను. నా కొడుకు చెంప పగులగొట్టింది. ఇప్పుడు నీ పరిస్థితుల్లో నీ అక్క ఉంది. ఏం చేస్తుంది. నా చెంప పగులగొడుతుందా? ముందు బతికి రమ్మను అంటుంది రాజ్యలక్ష్మి. అత్తయ్య.. దివ్య పొజిషన్ సరిగ్గా లేనప్పుడు బావ గారికి చెప్పకపోవడం అన్యాయం అంటుంది ప్రియ. అవునా.. నాకు తెలియదే అంటుంది. చూడు ప్రియ.. నీ ఏడుపుకు.. నీ కన్నీళ్లకు కరిగిపోయే మనసు కాదు నాది. నా స్వార్థం తర్వాతే నాకు ఏదైనా. దివ్య విషయంలో జరిగిన కథ అంతా.. పొరపాటున కానీ.. కావాలని కానీ విక్రమ్ కు చెప్పావంటే నీ కథ కంచికి పోతుంది. నీ ప్రాణం పోతుంది అని బెదిరిస్తుంది రాజ్యలక్ష్మి.

అత్తయ్య మీకు దండం పెడతాను.. కాళ్లు మొక్కుతాను అన్నా కూడా రాజ్యలక్ష్మి వినదు. నువ్వు బుద్ధిగా ఉండు. నువ్వు చూసింది.. విన్నది అంతా మరిచిపో అంటుంది రాజ్యలక్ష్మి. ప్రస్తుతం నువ్వు ఒక రాతిబొమ్మవు. అది గుర్తుపెట్టుకో అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు తులసి భోజనం చేయకుండా ఉంటుంది. వాడు అన్న మాటలు మనసులో పెట్టుకోకమ్మా. వాడి జాతకమే అంతా. వాడు కోరుకున్నది వాడి చేతికి దొరకదు. వాడి ఖర్మ అంతే. అనుభవించనీ అంటుంది అనసూయ. దీంతో ఎవరి మీదో కోపంతో నేను తిండి మానేయడం లేదు అత్తయ్య. మీరు తిన్నాక తింటాను అంటుంది తులసి. ఇంతలో అక్కడికి నందు వస్తాడు. ఎవ్వరూ అతడితో మాట్లాడరు. దీంతో వెళ్లి హాల్ లో కూర్చొంటాడు. ఎవరి మీద అలక అంటే.. ఎవరి మీద అలుగుతాను. ఎవరి మీద అలిగితే ఎవరు ఊరుకుంటారు. నేనేగా ఇక్కడ అందరికీ లోకువ అంటాడు నందు. ఎందుకురా ఊరికే అలగడం. కాలికి ముల్లు గుచ్చుకున్నప్పుడు బాధగానే ఉంటుంది. జాగ్రత్తగా ఆ ముల్లును బయటికి తీయాలి. ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి. ఇలా అరిచి హైరానా పడితే ఏంలాభం అంటుంది అనసూయ. నిన్నటి నుంచి ఏం తినలేదు. రా తిందువు కానీ అంటంది అనసూయ.

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : దివ్య సేఫ్ అని చెప్పిన డాక్టర్.. సంతోషంలో ప్రియ

దీంతో ఇప్పుడు నేను తినకపోతే కొంపలేమీ అంటుకోవు కదా. ఇప్పటి దాకా మీ అమ్మ గారు అక్కడే ఉన్నారు కదా. నేను రాగానే నన్ను దొంగలా చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్లింది. నాకు ఎలా తినబుద్ధి అవుతుంది అంటాడు నందు. ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు కదరా. అప్పటి వరకు ఓపికగా ఉండురా అంటుంది అనసూయ. ఇలా ఎవరి కోరికలు వాళ్లకు ఉంటాయి. అందరూ నా వైపే చూస్తారు. నేను ఏం చేయను. నా వల్ల కానిది అడిగితే నేను ఏం చేయాలి. జీవితంలో నా వల్ల నష్టపోయిన వాళ్లే కాదు.. నేను కూడా నష్టపోయాను అంటాడు నందు. ఈ కుటుంబంలో ఒకడిగా ఉండాలని ఉంది. మీ అందరితో పాటు కలిసి బతకాలని ఉంది. కానీ.. నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేయమంటారు చెప్పండి అంటాడు నందు.

మరోవైపు దివ్య సేఫ్ అని డాక్టర్ చెబుతాడు. కడుపులో బిడ్డ కూడా క్షేమం అని డాక్టర్ ప్రియకు చెప్పడంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. అక్కను చూడటానికి వస్తా అంటే వద్దు అవసరం లేదు. నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గుమ్మం దగ్గరే కాపలాగా పడి ఉండు. ఎవ్వరినీ రానివ్వకు అని చెప్పి లోపలికి వెళ్తుంది రాజ్యలక్ష్మి.

నిన్ను పైకి పంపిద్దాం అనుకుంటే జస్ట్ మిస్ అయ్యావు అని దివ్యతో అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో ఇరిటేట్ చేయొద్దు. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అంటే ఇక మన మధ్య మాటలు లేవు.. చేతలే వార్ వన్ సైడే అంటుంది రాజ్యలక్ష్మి. నేనేంటో తెలిశాక కూడా నువ్వు ఏం చేయలేవని అర్థం అయ్యాక కూడా ఎందుకు ఇలా ఎగిరెగిరి పడుతున్నావు అంటుంది రాజ్యలక్ష్మి. మీ అక్కకు చెప్పాల్సింది చెప్పాను అని బయటికి వచ్చి అంటుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు నందు మళ్లీ మందు తాగడం మొదలు పెడతాడు. ఇంట్లో కాకుండా వేరే ప్లేస్ లో కూర్చొని తాగుతూ ఉంటాడు. దీంతో తన దగ్గరికి వచ్చిన లాస్య.. నువ్వు ఇలా కుళ్లికుళ్లి ఏడవడమే తులసికి కావాలి. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నిన్ను జీవితంలో వదలను. నాతో రా అని అడుగుతుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక