Intinti Gruhalakshmi 16 Dec Today Episode : బీపీ ట్యాబ్లెట్స్ రెండు వేసుకొని స్పృహతప్పిపడ్డ పరందామయ్య.. విక్రమ్ కు యాక్సిడెంట్.. అతడిని చంపే ప్లాన్ వర్కవుట్ అవుతుందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 16 Dec Today Episode : బీపీ ట్యాబ్లెట్స్ రెండు వేసుకొని స్పృహతప్పిపడ్డ పరందామయ్య.. విక్రమ్ కు యాక్సిడెంట్.. అతడిని చంపే ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Intinti Gruhalakshmi 16 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 16 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1129 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ అమ్మ ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే మరిచిపోయిందిరా అని నందుతో చెప్పి బాధపడుతాడు పరందామయ్య. నాకు గాయం అయిన విషయం కూడా ఇప్పుడు చూసింది. నాకు సేవలు చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతోందిరా అంటూ నందుతో అంటాడు పరందామయ్య. […]

 Authored By gatla | The Telugu News | Updated on :16 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  పరందామయ్య పరిస్థితి చూసి బాధపడ్డ తులసి, అనసూయ

  •  బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నా అనే విషయం కూడా మరిచిపోయిన పరందామయ్య

  •  విక్రమ్ ను చంపేందుకు ప్లాన్ చేసిన బసవయ్య

Intinti Gruhalakshmi 16 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 16 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1129 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ అమ్మ ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే మరిచిపోయిందిరా అని నందుతో చెప్పి బాధపడుతాడు పరందామయ్య. నాకు గాయం అయిన విషయం కూడా ఇప్పుడు చూసింది. నాకు సేవలు చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతోందిరా అంటూ నందుతో అంటాడు పరందామయ్య. దీంతో అనసూయకు దు:ఖం ఆగదు. వెంటనే బయటికి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది అనసూయ. ఏడవకండి అత్తయ్య అంటుంది తులసి. దీంతో ఆయన్ను అలా చూడటం నా వల్ల కావడం లేదు అంటుంది అనసూయ. అందరికీ మంచి చెడు చెప్పే ఆయన అలా అవడం చూడలేకపోతున్నా అంటుంది తులసి. ఆయన ముందు మనం కన్నీళ్లు పెట్టుకోవద్దు అంటుంది తులసి. మరోవైపు దివ్య.. ఇప్పటి వరకు జరిగిన ఘటనల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇవన్నీ నిజంగా జరిగాయా.. లేక తాను భ్రమ పడ్డానా అని అనుకుంటుంది దివ్య.

మరోవైపు తులసి.. పరందామయ్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పరందామయ్యను ఎలా కాపాడుకోవాలో తనకు అర్థం కాదు. రోజురోజుకూ ఆయన మతిమరుపు ఎక్కువైపోతుంది. ఎవ్వరికీ అనిపించనివి నాకెందుకు అనిపిస్తున్నాయి. నేనే ఎందుకు ఫీల్ అవుతున్నాను. నా చుట్టూ ఏదో జరుగుతోంది. చివరకు విక్రమ్ తాతయ్య కూడా నా వైపు అనుమానంగా చూస్తున్నారు. నా మాటలు నమ్మినట్టు నటిస్తున్నారు కానీ నమ్మడం లేదు అని అనుకుంటుంది దివ్య. ఇంట్లో సమస్యలు తీరిపోయి అందరం సంతోషంగా ఉంటామని అనుకున్నాను కానీ.. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. క్షణ క్షణం భయంగా ఉంది అని అనుకుంటుంది తులసి. ఈ భయంతో ఎన్నాళ్లు గడపాలి. గది దాటి అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. నిద్ర పట్టడం లేదు. కొన్నాళ్లు ఇలాగే ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. నాకు ఎవరు సపోర్ట్ గా నిలబడతారు.. అని అనుకుంటుంది దివ్య.

Intinti Gruhalakshmi 16 Dec Today Episode : రెండు సార్లు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న పరందామయ్య

ఇంతలో దివ్యకు తులసి కాల్ చేస్తుంది. ఎలా ఉన్నావు దివ్య అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద తల పెట్టి పడుకోవాలని ఉంది. నీ దగ్గరే ఉండిపోవాలని ఉంది అంటే.. ఏమైంది దివ్య. ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ఏదైనా ప్రాబ్లమా అంటే నాకు పిచ్చట. నువ్వు నమ్ముతావా అని అంటుంది దివ్య. నీకు పిచ్చేంటమ్మా.. ఏమైంది అంటే.. అందరూ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు. ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు అంటుంది దివ్య. నిన్న రాత్రి హాల్ లో అత్తయ్య స్పృహ తప్పి పడిపోయినట్టు అనిపించారు. కంగారుగా అరుస్తూ అందరినీ పిలిస్తే అత్తయ్య మళ్లీ కనిపించలేదు. ఇదొక్కటే కాదు.. చాలా జరుగుతున్నాయి. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు అంటుంది దివ్య. దీంతో అలా ఎగ్జయిట్ అవ్వకు. కూల్ గా ఉండు. కూల్ గా మాట్లాడు అంటుంది తులసి.

అందరూ నా వైపు విచిత్రంగా చూస్తున్నారు. సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారట. నాకు భయంగా ఉంది అమ్మ. విక్రమ్ కూడా అలాగే అంటున్నాడు అంటుంది. దీంతో నువ్వు టెన్షన్ పడకు. ఈ సమయంలో ఇలాగే భ్రమలు కలుగుతాయి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అంటుంది తులసి. దీంతో అది భ్రమ కాదు. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటుంది దివ్య. దీంతో నువ్వు మెంటల్ గా అస్సలు టెన్షన్ తీసుకోకు. నీ పనులేవో నువ్వు చేసుకుంటూ వెళ్లు. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఎవ్వరితోనూ వాదించకు. అల్లుడు గారితో నేను మాట్లాడుతాను అంటుంది తులసి. దీంతో నా సంగతి నేను చూసుకుంటానులే.. అని ఫోన్ పెట్టేస్తుంది దివ్య. చివరకు అమ్మ కూడా నా మాట నమ్మడం లేదు. నేను మెడిటేషన్ చేయాలట అంటూ కోప్పడుతుంది.

మరోవైపు పరందామయ్య పేపర్ చదువుతూ ఉంటాడు. తనకు అక్షరాలు తలకిందులా కనిపిస్తుంటాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. అనసూయను పిలిచి అక్షరాలు తలకిందులుగా ఉన్నాయి. ఈ పేపర్ అబ్బాయిని మార్చేద్దాం అంటాడు. దీంతో పేపర్ ను తిప్పి ఇస్తుంది. దీంతో ఓకే ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి అంటాడు పరందామయ్య.

ఆ తర్వాత పరందామయ్యకు బీపీ ట్యాబ్లెట్ ఇస్తుంది అనసూయ. దీంతో బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాడు. నేను ఇప్పుడే దేవుడి దగ్గర దీపం పెట్టి వస్తాను అంటుంది అనసూయ. ఇంతలో పేపర్ లో బీపీ ట్యాబ్లెట్ల గురించి ఏదో చదువుతూ ఇప్పటికే బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నానని మరిచిపోయి.. మళ్లీ బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాడు పరందామయ్య. తల తిరిగినట్టు అయి అక్కడే కుప్పకూలిపోతాడు పరందామయ్య.

మరోవైపు బసవయ్య.. ఇంకా ఇంటి పనులు చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆ ఇంటి పనులు చేయడం ఏంటి అని సంజు అంటాడు. ఇంతలో దివ్య రావడం చూసి ఇక మొదలు పెట్టు అంటాడు సంజు. ఎలా ఉందమ్మా ఒంట్లో అంటే.. ఏంటా అడగడం నిక్షేపంలా ఉంది కనబడటం లేదా.. దివ్యకు బాగోలేనిది ఒంట్లో కాదు మనసులో. అంతే కదా అమ్మ అంటాడు బసవయ్య. ఈ మధ్య నీకు ఉన్నవి లేనట్టుగా కనిపిస్తోంది కదా. అందుకే అలా అడిగాను అంటాడు. మీరు వెటకారంగా అడిగినట్టుగా ఉంది అంటాడు బసవయ్య.

మీరే లేని సమస్యను క్రియేట్ చేస్తున్నారు. నాకే సమస్య లేదు అంటుంది దివ్య. నీ ప్రవర్తనలో తేడాను జబ్బే అంటారు. ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. డాక్టర్ కు చూపిస్తే ఏంటి అంటాడు సంజు. నేను చెప్పిన దాని గురించి పాజిటివ్ గా ఆలోచించు అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు బసవయ్య ఇంకో ప్లాన్ చేస్తాడు. విక్రమ్ ను చంపేద్దామని సంజుకు చెప్పిన విషయం వింటుంది దివ్య. దీంతో వెంటనే విక్రమ్ కు ఫోన్ చేస్తుంది దివ్య. ఇంతలో విక్రమ్ కారుకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక