Intinti Gruhalakshmi 28 Oct Today Episode : హనీని అప్పగించకపోతే దివ్యను చంపేస్తా అన్న లాస్య.. దీంతో హనీని లాస్యకు అప్పగించిన తులసి.. దివ్యను చంపేయాలని చెప్పిన రాజ్యలక్ష్మి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 28 Oct Today Episode : హనీని అప్పగించకపోతే దివ్యను చంపేస్తా అన్న లాస్య.. దీంతో హనీని లాస్యకు అప్పగించిన తులసి.. దివ్యను చంపేయాలని చెప్పిన రాజ్యలక్ష్మి

Intinti Gruhalakshmi 28 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 అక్టోబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1087 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను కిడ్నాప్ చేశామని లెటర్ డ్రైవర్ కు ఇచ్చి పంపించడంతో వెంటనే ఆ డ్రైవర్ విక్రమ్ దగ్గరికి వచ్చి లెటర్ ఇస్తాడు. దివ్య కిడ్నాప్ అయిందని చదివి షాక్ అవుతాడు. వెంటనే తులసి దగ్గరికి వెళ్లి లెటర్ చూపిస్తాడు. దీంతో తులసికి […]

 Authored By gatla | The Telugu News | Updated on :28 October 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  పోలీసుల ముందు తులసి పరువు తీసిన లాస్య

  •  దివ్యను నేనే కిడ్నాప్ చేశానని పోలీసులు వెళ్లాక తులసికి చెప్పిన లాస్య

  •  తులసిని చంపేయాలని లాస్యకు రాజ్యలక్ష్మి ఎందుకు చెప్పింది?

Intinti Gruhalakshmi 28 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 అక్టోబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1087 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను కిడ్నాప్ చేశామని లెటర్ డ్రైవర్ కు ఇచ్చి పంపించడంతో వెంటనే ఆ డ్రైవర్ విక్రమ్ దగ్గరికి వచ్చి లెటర్ ఇస్తాడు. దివ్య కిడ్నాప్ అయిందని చదివి షాక్ అవుతాడు. వెంటనే తులసి దగ్గరికి వెళ్లి లెటర్ చూపిస్తాడు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో నందు వచ్చి నువ్వు తులసి దగ్గర ఏం మాట్లాడినా వేస్ట్. ఎందుకంటే.. మా ఫ్యామిలీలో హనీ కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అంటాడు నందు. ఏంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు అంటాడు విక్రమ్. దీంతో మరి హనీని తీసుకెళ్లి ఇచ్చేద్దామా.. అంటూ హనీ రూమ్ కు వెళ్లబోతుండగా తులసి ఆపుతుంది. హనీని వాళ్లు బతకనివ్వరు. మనం చేయాల్సింది హనీని వాళ్లకు అప్పగించడం కాదు. మనం పోలీస్ కంప్లయింట్ ఇద్దాం అంటుంది తులసి. ఆ కిడ్నాపర్ల నుంచి నా కూతురును రక్షించుకునే బాధ్యత నాది. నాకు నా కూతురు అంటే ప్రేమ ఉండదా? పట్టించుకోకుండా ఎలా ఉంటాను. దయచేసి ఎవ్వరూ నాకు అడ్డు రావద్దు ప్లీజ్ అని వేడుకుంటుంది తులసి. విక్రమ్ నువ్వు నాతో రా అని చెప్పి తీసుకొని వెళ్తుంది తులసి. మీకు నమ్మకం ఉందా? తులసి దివ్యను తీసుకొస్తుందా? చెప్పండి నాన్న. చెప్పు అమ్మ. మీ వల్లే తులసి ఇలా తయారైంది. మాట వినకుండా అయింది అంటాడు నందు.

మరోవైపు లాస్య, రత్నప్రభ ఇద్దరూ చెస్ ఆడుతూ ఉంటారు. మనం ఇంత ప్లాన్ చేసి చేశాం కానీ.. ఏ చిన్న తప్పు చేసినా ఓడిపోతాం అని రత్నప్రభతో లాస్య అంటుంది. కరెక్ట్ గా చెప్పావు లాస్య అంటుంది తులసి. పోలీసులను తీసుకొని తులసి.. రత్నప్రభ ఇంటికి వెళ్లడంతో షాక్ అవుతారు. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ నీ శత్రువు ఎప్పుడూ నీకంటే వంద అడుగులు ముందే ఉంటుంది అంటుంది లాస్య. దీంతో నువ్వు పెద్ద తోపువు అయి ఉండొచ్చు. కానీ ప్రతిసారి నీదే గెలుపు అవ్వాలని లేదు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా వెళ్లేది జైలుకే. ఎస్ఐ గారు మా అమ్మాయిని కిడ్నాప్ చేసింది తనే. వెంటనే అరెస్ట్ చేయండి. నా కూతురు ఎక్కడుందో తెలుసుకొని వెంటనే కాపాడండి అంటుంది తులసి. దీంతో నీ కూతురును నేను కిడ్నాప్ చేయడం ఏంటి.. నేను కిడ్నాప్ చేయలేదు అంటుంది లాస్య. నా మీద పగ తీర్చుకోవడానికి కిడ్నాప్ కథ అల్లి జైలుకు పంపించాలని చూస్తోంది అంటుంది లాస్య. దీంతో దివ్య కిడ్నాప్ కథ కాదు. మా డ్రైవర్ ముందే జరిగింది అంటాడు విక్రమ్. దీంతో నువ్వు కూడా తులసి ట్రాప్ లో పడ్డావా? అంటుంది. ఎస్ఐ గారు ఇప్పటికే ఆలస్యం అయింది తీసుకెళ్లండి. నాలుగు తగిలిస్తే నిజం అదే బయటికి వస్తుంది అంటాడు విక్రమ్. ఆగండి.. అలా ఎలా అరెస్ట్ చేస్తారు అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 28 Oct Today Episode : పోలీసుల ముందు తులసి పరువు తీసిన లాస్య

నా దగ్గర సాక్ష్యం ఉంది. ఎంత పెద్ద దొంగ అయినా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు. నువ్వు కూడా అక్కడే దొరికిపోయావు అంటుంది తులసి. ఆ కాగితం ఎస్ఐకి ఇస్తాడు విక్రమ్. కానీ.. అందులో ఏం రాసి ఉండదు. దీంతో తెల్లకాగితం ఇచ్చారు అంటాడు ఎస్ఐ. మాతో ఆడుకుంటున్నారా? మీ మీద నమ్మకంతో గుడ్డిగా ఇక్కడికి వచ్చాం. సారీ మేడమ్ అని లాస్యతో అంటారు పోలీసులు.

నిజానికి అది మ్యాజిక్ పెన్ తో రాయడంతో అది చెరిగిపోతుంది. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. తన కూతురును ఎలా రక్షించుకోవాలో అర్థం కాదు. పోలీసులు వెళ్లిపోయాక అసలు విషయం చెబుతుంది లాస్య. దివ్యను కిడ్నాప్ చేసింది నేనే అంటుంది లాస్య. నిన్ను.. అంటూ లాస్యపై కోపంతో వెళ్లబోతాడు విక్రమ్.

ఆగు అంటుంది లాస్య. రాగానే భారీ ఎత్తున ఓ డైలాగ్స్ చెప్పావు కదా. తెలివి నీకేనా.. నాకు లేదా? సాక్ష్యాన్ని ఇంత ఈజీగా నీ చేయికి ఇచ్చి అలా ఎలా దొరికిపోతానని అనుకున్నావు. ఇక్కడ ఉంది లాస్య. వచ్చిందమ్మా వయ్యారి.. పోలీసులను వెంటపెట్టుకొని.. నా జుట్టు పట్టుకొని లాక్కెళ్లడానికి. అసలైన సాక్ష్యం నీ దగ్గర కాదు. నా దగ్గర ఉంది. చూస్తావా అంటూ ఫోన్ ఓపెన్ చేసి దివ్యను కట్టిపడేసిన వీడియోను చూపిస్తుంది లాస్య.

దివ్యను అలా కట్టిపడేయడం చూసి విక్రమ్, తులసికి ఏం చేయాలో అర్థం కాదు. లాస్య నువ్వు చేస్తుంది తప్పు అంటుంది తులసి. దీంతో ఆ సంగతి నాకు తెలుసు అంటుంది లాస్య. ప్రాణాలతో ఆడుకోవడం పద్దతి కాదు అంటుంది తులసి. దీంతో నాకూ ఇష్టం లేదు. కానీ.. హనీ కోసం తప్పడం లేదు అంటుంది లాస్య.

హనీ మీద సర్వ హక్కులు మావి. వెంటనే తీసుకొచ్చి అప్పగించండి. సమయం లేదు. మణికట్టు దగ్గర నరం కట్ చేశాను. రక్తం ఆగకుండా వస్తోంది. నా లెక్క ప్రకారం ఇంకో నాలుగు ఐదు గంటలు మాత్రమే దివ్య బతుకుతుంది అంతే. ఆలస్యం చేయకుండా వెంటనే హనీని తీసుకొని అప్పజెప్పు. అతిగా ఆలోచించకు. గడుస్తున్న ప్రతి నిమిషం.. దివ్యను చావుకు దగ్గర చేస్తుందని మరిచిపోకండి. వెళ్లండి అంటుంది లాస్య.

దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. దివ్యకు ఏం కాదు. మీరు వెళ్లిపోండి. నేను దివ్యను తీసుకొస్తాను అని చెప్పి విక్రమ్ ను పంపించేస్తుంది తులసి. ఇంత తెలివి పెట్టుకొని నందగోపాల్ ను ఎలా వదులుకున్నావు. ఎందుకు ఒంటరిదానివి అయ్యావు అని లాస్యను మెచ్చుకుంటుంది రత్నప్రభ.

ఇంతలో రాజ్యలక్ష్మి… లాస్యకు ఫోన్ చేస్తుంది. ఏం జరుగుతోంది అంటే.. దివ్యను కిడ్నాప్ చేశాం. ఇంకాసేపట్లో ఓటమిని ఒప్పుకొని హనీని అప్పగించేందుకు తులసి రాబోతోంది అంటుంది లాస్య. హనీని అప్పగించగానే దివ్యను వదిలేస్తా అంటుంది లాస్య.

అదే జరగకూడదు. ఇదేమీ ధర్మ యుద్ధం కాదు. దివ్యను వదిలిపెట్టడానికి వీలు లేదు. అసలు దివ్య బతికి ఉండటానికే వీలు లేదు అంటుంది రాజ్యలక్ష్మి. సరే సరే.. అది నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. హనీ మన ఇంటికి తిరిగి వచ్చాక దివ్యను వదిలిపెట్టాల్సిందే అంటుంది రత్నప్రభ. దివ్యను తిరిగి ఇవ్వకపోతే తులసి, నందు ఊరుకుంటారా? రచ్చ రచ్చ చేస్తారు. ఈ గొడవ అంతా మనకు అవసరమా అంటుంది రత్నప్రభ.

రాజ్యలక్ష్మిని మన విషయంలో తలదూర్చవద్దని చెప్పు అంటుంది రత్నప్రభ. మన కేసు క్లోజ్ అయ్యాక నువ్వు రాజ్యలక్ష్మితో డీల్ చేసుకో కానీ.. ఇప్పుడు కాదు అంటుంది రత్నప్రభ. మీ అవసరంతో పాటు నా పగను కూడా తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది లాస్య. దీంతో నీ పర్సనల్ పగ కోసం మమ్మల్ని పావులుగా వాడుకోకు అంటుంది రత్నప్రభ.

మరోవైపు విక్రమ్ ఇంటికి వస్తాడు. ఏమైంది బావ అని అడుగుతుంది జాను. దివ్య క్షేమంగానే ఉందా అంటే లేదు నాన్న ప్రమాదంలోనే ఉంది అంటాడు. మరోవైపు తులసి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తుంది. హనీని అప్పజెప్తేనే దివ్యను వదిలేస్తాం అంటున్నారు అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది