Intinti Gruhalakshmi 3 Nov Today Episode : మనసు విప్పి మాట్లాడుకున్న తులసి, నందు.. ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? తులసికి కోర్టు నోటీసులు పంపించిన లాస్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 3 Nov Today Episode : మనసు విప్పి మాట్లాడుకున్న తులసి, నందు.. ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? తులసికి కోర్టు నోటీసులు పంపించిన లాస్య

 Authored By gatla | The Telugu News | Updated on :3 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  జాను మనసు మార్చాలని ప్లాన్ చేసిన బసవయ్య

  •  సరదాగా గడిపిన విక్రమ్, దివ్య

  •  నందును పొగిడిన తులసి

Intinti Gruhalakshmi 3 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 3 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1092 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాను డల్ గా కూర్చోవడం చూసి తన తండ్రికి నచ్చదు. ఏమైంది జాను.. అలా డల్ గా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అంటే.. దివ్యక్కను కిడ్నాప్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటుంది. దీంతో వామ్మో.. దివ్య మీద ప్రేమ కురిపిస్తోంది అని తన మైండ్ ను డైవర్ట్ చేయాలని అనుకుంటాడు తన నాన్న. ఈ కిడ్నాప్ డ్రామా అనేది తులసి, దివ్య కలిసి ఆడిన నాటకం అంటాడు. ఎందుకు అంటే.. విక్రమ్ పరితపించేలా చేయడం కోసం, ఇద్దరూ కలిసి విక్రమ్ ను గ్రిప్ లో పెట్టుకోవడం కోసం అంటాడు. నువ్వేమో దివ్య విషయంలో తెగ బాధపడిపోతున్నావు. తప్పు అయిపోయింది బావ అని చెబుతున్నావు అంటాడు. దీంతో ఆయన మాటలు నమ్మదు. తులసి ఆంటి, దివ్య అక్క అలాంటి వాళ్లు కాదు అంటుంది. కిడ్నాప్ చేసిన వాళ్లు మీ ఆయన చేతికి లెటర్ ఇవ్వడం ఏంటి.. డైరెక్ట్ గా తులసి కి ఇవ్వొచ్చు కదా. అక్కడఎక్కడో టీ స్టాల్ వాడు కారు నెంబర్ రాసుకోవడం ఏంటి.. ఇదంతా కావాలని చేసింది కాకపోతే అంటాడు. దివ్యక్కను అస్సలు నమ్మకు. పైకి అమాయకంగా కనబడుతుంది కానీ.. దేశముదురు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ అత్తయ్య మాటలే విను. దివ్య ముందు చెంపలేసుకోవడాలు లాంటి కార్యక్రమాలేవీ పెట్టుకోకు అని తన మైండ్ డైవర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు తన తండ్రి.

మరోవైపు హనీ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది హనీ నిద్రరావడం లేదా అంటే లేదు ఆంటి భయం వేస్తోంది. నిద్రపోతే ఎవరైనా మళ్లీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తారేమో అంటుంది హనీ. దీంతో ఏం కాదు.. ఇక ఎవ్వరూ నిన్ను అక్కడికి తీసుకుపోరు అంటుంది తులసి. అంకుల్ కూడా మళ్లీ నిన్ను మనసు మార్చుకొని తీసుకొచ్చారు కదా అని బుజ్జగించి పడుకోబెడుతుంది తులసి. మరోవైపు నందు భోజనం చేయడు. కనీసం పాలు అయినా తాగండి అని చెప్పి తీసుకెళ్లి ఇస్తుంది తులసి. దీంతో వద్దు తులసి నా మనసు బాగోలేదు అంటాడు. హనీకి చేసిన మోసం వల్ల తన వైపు చూడాలంటేనే గిల్టీగా అనిపిస్తోంది. ముఖం దాచుకొని తిరుగుతున్నాను. ఇంకా ఈ శిక్ష ఎన్నాళ్లు అంటాడు నందు. ఎవరైనా సరే.. తన మనసుకు నచ్చింది చేయడంలో తప్పు లేదు. కానీ.. అది వేరే వాళ్ల మనసును నొప్పించేలా చేయకూడదు అంటుంది తులసి. ఈ రోజు నాకు ఎప్పుడూ లేనంత ధైర్యంగా ఉంది. ఎందుకో తెలుసా? మొదటిసారి మీరు నాకు అండగా నిలబడ్డారు అంటుంది తులసి. పాతికేళ్ల మన కాపురంలో ఏం జరిగినా నా భర్త నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యం ఏ ఒక్క రోజు లేదు. పైగా భయంగా కూడా ఉండేది. డైవర్స్ తీసుకున్నా మనం ఒకే నీడలో ఉంటున్నాం. అప్పుడు కూడా తోటి మనిషిగా నాకు సపోర్ట్ గా నిలబడలేదు. ఎప్పుడూ మీ వైపు అనుమానంగా చూడాల్సి పరిస్థితి. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కానీ.. ఈరోజు అనిపిస్తోంది. మిమ్మల్ని నమ్మొచ్చు అని అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 3 Nov Today Episode : కిడ్నాప్ ఫెయిల్ అయిందని బాధపడ్డ లాస్య, రత్నప్రభ

హనీని మన ఇంట్లో ఉంచుకునే విషయంలో నేను మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నాను. దానికి కారణం.. హనీ మీద ఇష్టం లేకపోవడం కాదు. నా వాళ్లకు ఏమౌతుందో అని కంగారు. నా కూతురు ప్రమాదంలో ఉందని చాలా భయపడ్డాను. అందుకే హనీని అప్పగించాలనుకున్నాను. నా మనసును రాయిని చేసుకొని హనీని బలవంతంగా లాక్కెళ్లాను కానీ.. అక్కడ హనీ కళ్లలో నీళ్లు చూశాక.. రాయిలా మారిన నా మనసు మళ్లీ కరిగిపోయింది. నా తప్పేంటో తెలిసి వచ్చింది అంటాడు నందు.

ఒక్క క్షణం పాటు దివ్య గుర్తుకు రావడం మానేసింది. కేవలం మానవత్వంతోనే మనసు నేర్పింది అంటాడు నందు. పశ్చాతాపం అనేది ఒక భావోద్వేగం కాదు. మనిషిలో మార్పునకు గుర్తు. సంతోషంతో ఈ రోజు నాకు కూడా కడుపు నిండిపోయింది అంటుంది తులసి. అందుకే.. నేను భోం చేయలేదు అంటుంది. పాలు తాగాను. మీరు కూడా పాలు తాగండి అంటుంది తులసి. నేను వెళ్తున్నాను. మీ ఇష్టం వచ్చినంత సేపు ఒంటరిగా కూర్చోండి అంటుంది తులసి.

అయిపోయింది.. ఇక అంతా అయిపోయింది. ఇక మనం ఎంత బెదిరించినా ఆ తులసి, నందు భయపడరు అని లాస్యతో అంటుంది రత్నప్రభ. ఇప్పటి నుంచి ఒక్క తులసి మాత్రమే పోరాడేది. ఇప్పుడు నందు కూడా తనకు మద్దతు ఇస్తున్నాడు అంటుంది. నా దారి నేను చూసుకోనా మరి.. అంటుంది లాస్య. చేతికందిన హనీని నందు తిరిగి లాక్కోపోతే బాధగా ఉండదా అంటుంది రత్నప్రభ.

నువ్వు దివ్యను కిడ్నాప్ చేసినా రౌడీలను సరిగ్గా మేనేజ్ చేయలేకపోయావు. దివ్యను చంపడం మీదనే ఆసక్తి చూపించావు. అందుకే కిడ్నాప్ ప్లాన్ ఫెయిల్ అయింది అంటుంది రత్నప్రభ. దీంతో హనీ ప్లాన్ ను ఫెయిల్ చేసిందే నువ్వు అంటుంది లాస్య. నువ్వే నందు ముందు హనీ విషయంలో కొంచెం హార్ష్ గా ప్రవర్తించావు అంటుంది లాస్య.

మరోవైపు తెల్లవారుతుంది. నందు హుషారుగా కనిపిస్తాడు. నందు హుషారుగా ఉండటం చూసి పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు. ఏంట్రా సంగతి.. ఇంత హుషారుగా ఉన్నావు అని అడుగుతుంది అనసూయ. చెప్పుకోండి చూద్దాం అంటాడు నందు. కానీ.. వాళ్లు చెప్పలేకపోతారు.

ఒరేయ్.. ఓడిపోయాం. నీ సంతోషానికి కారణం ఏంటో నువ్వే చెప్పు అంటారు. దీంతో తులసి నన్ను పొగిడింది. పొగడ్తలతో నా జీవితాన్ని పావనం చేసింది. నేను చేసిన పనికి సంతోషంతో పొంగిపోయిందట. నేను అండగా ఉన్నందుకు కొండత అండగా ఉందట అంటాడు నందు. దీంతో నువ్వు అక్కడ హనీని పంపించి ఉంటే అప్పుడు ఉండేది నీకు అంటాడు పరందామయ్య.

ఇంతలో తులసి కాఫీలు పట్టుకొని అక్కడికి వస్తుంది. ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. నన్ను పిలవలేదు ఏంటి అంటుంది తులసి. దీంతో నందు ఏం చెబుతున్నాడంటే అంటూ చెప్పబోతుండగా అనసూయ ఆపి ముందు మీరు కాఫీ తాగండి అంటుంది అనసూయ.

ఏంటి చెప్పండి మామయ్య అంటే.. నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉందట అని చెబుతాడు పరందామయ్య. సాయంత్రం స్వీట్ చేసి పెట్టమని వాళ్ల అమ్మకు చెబుతున్నాడు అంటాడు. దీంతో సరే నేను చేస్తాలేండి అని చెబుతుంది తులసి.

నిన్ను కిడ్నాప్ చేసి దాచిపెట్టిన చోటుకు బావ వెతుక్కుంటూ కష్టపడి వచ్చాడు. సరిగ్గా అదే చోటుకు తులసి ఆంటి కూడా ఎలా చేరుకుంది అని దివ్యను అడుగుతుంది జాను. అసలు ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. సమయానికి మా అమ్మ వచ్చి నన్ను రక్షించినందుకు సంతోషం వ్యక్తం చేయాలి కానీ.. ఇలా నన్ను అనడం ఏంటి అంటుంది దివ్య.

మరోవైపు హనీని వాళ్ల ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లారని రత్నప్రభ కేసు వేసింది. దానికి సంబంధించి కోర్టు నుంచి నోటీసు పంపించారు అని నందు.. లాస్యకు చెబుతాడు. ఆ తర్వత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది