Intinti Gruhalakshmi 9 Dec Today Episode : పరందామయ్యకు అల్జీమర్స్ వ్యాధి.. ఈ విషయం తెలిసి తులసి షాక్.. దివ్య సేఫేనా? రాజ్యలక్ష్మి మళ్లీ ఏం ప్లాన్ వేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 9 Dec Today Episode : పరందామయ్యకు అల్జీమర్స్ వ్యాధి.. ఈ విషయం తెలిసి తులసి షాక్.. దివ్య సేఫేనా? రాజ్యలక్ష్మి మళ్లీ ఏం ప్లాన్ వేస్తుంది?

 Authored By gatla | The Telugu News | Updated on :9 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  నందును తులసి నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించిన లాస్య

  •  లాస్య మాటలు నమ్మని నందు

  •  పరందామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన తులసి

Intinti Gruhalakshmi 9 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 9 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1123 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు అర్థం కాని విషయం ఒక్కటే.. ఇప్పుడు తులసి నాకు వేసిన శిక్ష మా పాతికేళ్ల కాపురంలో తనను ఏడిపించినందుకా, లేక వాళ్ల అమ్మ చావుకు కారణం అయినందుకా అని తెలియక బాధపడుతూ ఉంటాడు నందు. అన్ని కోపాలు కలిసి ఒకేసారి తీర్చుకుంటున్నట్టుగా ఉంది. ఎన్ని పాపాలు చేసినా పోయేముందు దేవుడిని తలుచుకుంటే చాలు. దేవ దూతలు వచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు. దేవుడి విషయంలో అంత లిబరల్ గా ఉన్నప్పుడు ఈ తులసి ఎందుకు ఇంత కర్కశంగా ఉంది. కాళ్లు పట్టుకున్నా కరగలేదు. చా.. పొగరుబోతు అంటూ మందు తాగుతూ బాధపడుతూ ఉంటాడు నందు. మరోవైపు నందును వెతుక్కుంటూ అక్కడికి లాస్య వస్తుంది. లాస్యను చూసి షాక్ అవుతాడు నందు. ఆమె రాగానే వెళ్లబోతుండగా ఎక్కడికి అంటే నేను చెప్పను. లేకపోతే అక్కడికి కూడా వస్తావు అంటాడు నందు. నాకు చిరాకుగా ఉంది అస్సలు విసిగించకు అంటాడు నందు. నువ్వు శత్రువును మించిన శత్రువువి. పరమ శత్రువువి అని అర్థం. అందుకే నిన్ను ఇంతగా హింసిస్తుంది తులసి. నువ్వు తెలిసి తప్పు చేయలేదు. ఆ విషయం తులసికి కూడా తెలుసు. కావాల్సిన వాళ్లు చేసిన తప్పును ఎంతకాలం మోస్తుంది. అవకాశం దొరికినప్పుడుల్లా ఏడిపిస్తూనే ఉంటుందా? పగ తీర్చుకుంటూనే ఉంటుందా అని ప్రశ్నిస్తుంది లాస్య.

అందరినీ మరిచిపోయి నువ్వు తనను సపోర్ట్ చేసినప్పుడు నీ మీద తను చూపించే పద్ధతి ఇదేనా? తులసి తల్లి చావు అలా రాసిపెట్టి ఉంది. అలా జరిగింది అంతే. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించలేదా? నువ్వు నన్ను వదిలేసినా నేను నీ చుట్టూ తిరుగుతున్నాను. నందు పరిస్థితి ఏంటి ఇలా అయిందని బాధపడుతున్నా? అవకాశం దొరికింది. తులసి నిన్ను టార్గెట్ చేసింది. తన పాతికేళ్ల కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది. నువ్వు బోలా మనిషివి. మనసులో కుళ్లు కుతంత్రాలు ఉండవు. అందుకే ఇలా తాగి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. అయినా సరే.. తులసి నీ మీద జాలి పడటం లేదు. ఇక ఎప్పటికీ జాలి పడదు. నువ్వు ఇలా కుళ్లి కుళ్లి ఏడవడమే తులసికి కావాలి. తులసి మారుతుందని నువ్వు ఆశపడటం ఎండమావుల్లో నీటిని వెతకడమే. ఇక చాలు నందు టైమ్ వేస్ట్ చేసుకోకు. జీవితం వేస్ట్ అవుతుంది. నాతో వచ్చేయ్. తులసి లాగా నేను గతం తవ్వను. నిన్ను జీవితంలో వదిలిపెట్టను. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. బాధతో ఇలా మందు తాగే పరిస్థితి ఇలా అస్సలు రానివ్వను పదా నందు అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 9 Dec Today Episode : లాస్య చెప్పిన మాటలు అస్సలు వినని నందు

అయినా నందు వినడు. ఇంకా మందు తాగుతూనే ఉంటాడు. వెళ్దాం పదా అంటే నువ్వు వెళ్లు అంటాడు నందు. నేను అమాయక గోవును కాదు పులిని నమ్మడానికి. తులసి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అంటాడు నందు. తులసిది నిష్కల్మష హృదయం, నిజాయితీకి నిలువెత్తు రూపం. తులసి ఒక దేవత అంటాడు నందు. నువ్వు ఒక పెద్ద దెయ్యానివి. నీకు అర్థం కావడం లేదు. అందం ఉందని మురిసిపోతున్నావు. అందం కాదే కావాల్సింది మనసు ఉండాలి అంటాడు. తను నిన్ను ఏడిపించుకొని తింటుంటే నీకు అర్థం కావడం లేదా అంటే నేను తనకు ఎంతో నష్టం చేశాను. అప్పుడు తులసి ఏడిపించడంలో తప్పేం లేదు అంటాడు నందు.

ఈ నరకాన్ని ఎన్ని రోజులు అయినా భరిస్తాను. ఇందులో తృప్తి ఉంది. కానీ.. పొరపాటున కూడా నీతో జీవితాన్ని పంచుకోను. ఆ నరకం అస్సలు భరించలేను. నిద్రలో కూడా నిన్ను నమ్మను. నా వెంట పడటం మానేయ్. నేను భోలా మనిషినే కానీ.. నీ విషయంలో మాత్రం కాదు అంటాడు నందు. నీ విషయంలో రాక్షసుడిని. నా జోలికి వచ్చావంటే నిన్ను దబ్బిడి దబ్బిడి చేస్తా. అలా బాటిల్ లా విసిరేస్తా అంటాడు నందు.

మరోవైపు పరందామయ్యను తీసుకొని ఆసుపత్రికి వెళ్తుంది తులసి. ఆయనకు మతిమరుపు వస్తోందని డాక్టర్ ను అడుగుతుంది తులసి. బయటికి వెళ్తే ఇంటికి దారి మరిచిపోతున్నారు అని చెబుతుంది. దీంతో పరందామయ్యను టెస్ట్ చేస్తాడు డాక్టర్. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందని చెబుతాడు డాక్టర్. ఆయనకు ఉంది మతిమరుపే కదా అంటుంది అనసూయ. దీంతో ఇప్పటికి ఇది చిన్న సమస్యే కానీ.. అది రాను రాను ఎక్కువ అవుతుంది అంటాడు.

మరోవైపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వస్తుంది దివ్య. విక్రమ్ వచ్చి తనకు భోజనం తినిపిస్తాడు. కానీ.. అస్సలు తినదు దివ్య. వద్దు అంటుంది దివ్య. ఆ భోజనం అమ్మ పెట్టి ఇచ్చింది అనగానే నాకు ఆకలిగా లేదు. నేను తినను అంటుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది