Electric Cycle : ఈ మెకానిక్ తెలివి మామూలుగా లేదు .. సైకిల్ ను బైక్ గా ఎలా మార్చాడో చూడండి ..??
Electric Cycle : ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిళ్లను వినియోగించేవారు కానీ ఇప్పుడు బైక్స్, స్కూటర్లు, కార్లు రావడంతో వాటిని పక్కన పడేశారు. సమయం వృధా కాకుండా ఎక్కువగా కష్టపడకుండా లేటెస్ట్ వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే తాజాగా గుజరాత్ కి చెందిన నఠూభాయ్ అనే మెకానిక్ సైకిల్ ను బైక్ గా మార్చేశాడు. గుజరాత్ లోని సూరత్ లో మెకానిక్ గ్యారేజ్ నిర్వహించే 60 ఏళ్ల నఠూభాయ్ ఈ వింత ఎలక్ట్రిక్ సైకిల్ ని కనుగొన్నారు. ఆయన దానిపై దూసుకెళ్తుంటే రోడ్డుపై అందరూ దాన్ని చూస్తున్నారు.
ఏదైనా కొత్తగా చేయాలనిపించే నటుబాయ్ చదివింది ఏడో తరగతే కానీ బైక్ రిపేర్లు చేసే ఆయన నైపుణ్యం అనుభవం చూసి పెద్ద పెద్ద ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. నఠూభాయ్ మాట్లాడుతూ నాకు ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది. అందుకే మొదట దీనిని డ్రాయింగ్ వేసుకొని చేయగలనా లేదా అని చూశాను. మొదట దీనికి పెట్టిన స్టీరింగ్ నిటారుగా ఉండేది. తర్వాత దీనిని ట్రాఫిక్ లో నడపాల్సి ఉంటుందని ఆలోచన వచ్చింది. దాంతో పాత సామాన్ల నుంచి హ్యాండిల్ తీసుకొచ్చి దీనికి బిగించాను. తర్వాత ఈ వైపున గుండ్రంగా తయారు చేశాను. దానిపే శబ్దం రాకుండా టైరును బిగించాడు. దాని వలన రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎక్కువగా శబ్దం రాదు.
ప్లాస్టిక్ బిగించి బేరింగ్ వేశాడు. ఇంజిన్ పెట్టడం కంటే బ్యాటరీ బెటర్ అని బ్యాటరీ బిగించాడు. బ్రేక్ వేస్తే చక్రానికే ఉన్న బ్రేకులు పడతాయి. అలాగే బ్యాటరీ లో ఛార్జింగ్ ఎంత ఉందో చూపించడానికి మీటర్ ను బిగించాడు. అలాగే లైట్లను కూడా బిగించాడు. ఇక ఈ బైక్ తయారు చేయడానికి ఆయనకు దాదాపుగా 50,000 ఖర్చు అయ్యిందట. అలాగే కొన్ని పాత సామాన్ల నుంచి కూడా ఈ బైకుకు కావాల్సినవి తీసుకున్నాడు. ఇక ఈ బైకును తయారు చేయడానికి ఆయనకు ఆరు నెలలు సమయం పట్టిందట. మొత్తానికి మెకానిక్ తెలివి మామూలుగా లేదు. ఈ వింత ఎలక్ట్రిక్ సైకిల్ ను చూసి నటిజన్స్ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.