Viral Video : చనిపోయే వ్యక్తిని సిపీఆర్ చేసి బ్రతికించిన పోలీస్ అధికారి .. వైరల్ వీడియో..!
Viral Video : ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలామంది ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా అకస్మాత్తుగా మరణిస్తున్నారు. మరి ముఖ్యంగా గుండెపోటుతో మరణించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు 40 ఏళ్లు పైబడిన వారికే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు 25 , 30 ఏళ్లకే గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇప్పటికే చాలామంది యువత గుండెపోటు తో మరణించారు. అయితే గుండెపోటు వచ్చినప్పుడు సరైన సమయంలో వైద్యం అందిస్తే ఆ వ్యక్తి బ్రతికే అవకాశం ఉంటుంది.
గుండెపోటు వచ్చి చనిపోయే వ్యక్తిని ఐదు నిమిషాల్లో మళ్లీ బ్రతికించవచ్చు. ఎలా అంటే సిపిఆర్ చేయడం. గుండెపోటు వచ్చిన వ్యక్తికి వెంటనే సిపిఆర్ అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. సిపిఆర్ అంటే రెండు చేతులను చాతి మీద నొక్కి పట్టడం. ఇలా చేస్తే గుండెపోటుకు గురైన వ్యక్తి బ్రతికే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఇలా గుండెపోటుకు గురైన వ్యక్తికి సిపిఆర్ చేసి బ్రతికి ఇచ్చారు. అలాగే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురి అయ్యాడు దీంతో అక్కడే ఉన్న పోలీస్ అధికారులు ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి బ్రతికించారు.
ఈ ఘటన రాజస్థాన్లోని బరాన్ జిల్లాలో చోటు చేసుకుంది. బరాన్ జిల్లాలో ఏకాదశి సందర్భంగా కొందరు యువకులు కర్రలతో స్టంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఒక యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోగా మరో యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడే ఉన్న పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ మీనా సిపిఆర్ చేశారు. ఐదు నిమిషాల పాటు తీవ్రంగా ప్రయత్నించి యువకుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త ఇలా వైరల్ గా మారింది.
సీపీఆర్ చేసి చనిపోయే వ్యక్తిని బతికించాడు
రాజస్థాన్ బరాన్ జిల్లాలో ఏకాదశి సందర్భంగా కొందరు యువకులు కర్రలతో స్టంట్స్ చేశారు. ఓ యువకుడు కార్డియాక్ అరెస్టుతో చనిపోగా, మరో యువకుడు సైతం గుండెపోటుతో కుప్పకూలాడు.
అక్కడే ఉన్న పోలీస్ అధికారి రాజేంద్ర కుమార్ మీనా సీపీఆర్ చేశారు. 5… pic.twitter.com/MPTshDjJdI
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2023