Viral Video : హే బిడ్డా.. ఇది అడ్డా… అంటూ హంసలు ఓ వ్యక్తిపై ఎలా దాడి చేశాయో చూడండి
Viral Video : ప్రస్తుతం ప్రపంచం అంతా కాంక్రీట్ జంగల్ గా మారింది. అడవులన్నీ అంతరించిపోతున్నాయి. అందుకే జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. జంతువులు జనావాసాల్లోకి వస్తే.. రోడ్డ మీదికి వస్తే ఏం చేస్తాం మనం. వాటిని తరిమి తరిమి కొడతాం. వాటిని ఊళ్ల నుంచి బయటికి పరిగెత్తించి మరీ కొడతాం.దానికి పర్ ఫెక్ట్ ఉదాహరణ కోతులు. కోతులు ఇళ్ల మీదికి రాగానే మనమంతా కలిసి ఎలా వాటిని వెళ్లగొడతామో.. అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. కానీ.. అది పూర్తిగా రివర్స్ గా జరిగింది.
అర్థం కాలేదా.. ఓ వ్యక్తి చెరువు లాంటి చిన్న కొలనులో ఈత కొడుతున్నాడు.అందులో రెండు నల్లటి హంసలు ఉన్నాయి. ఆ వ్యక్తిని చూసి హంసలు అతడి వైపు దూసుకొచ్చి.. అతడిపై దాడి చేశాయి. అవి దాడి చేయడం గమనించిన ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి తెగ ప్రయత్నించాడు.ఏమాత్రం ఆలస్యం చేసినా.. ఆ హంసలు అతడిని నీళ్లలో ముంచి చంపేసేవే. వేగంగా ముందుకు ఈదుకుంటూ వెళ్లి ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటపడ్డాడు.

black swans attacked man who is swimming in lake video viral
Viral Video : తృటిలో ప్రాణాలను కాపాడుకున్న వ్యక్తి
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ బిడ్డా.. ఇది మా అడ్డ.. అన్నట్టుగా హంసలు అతడిపై దాడి చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.హంసలు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. అక్కడ హంసల గూడు ఉందట. ఆ గూడును అతడు ఏమైనా చేస్తాడేమో అని భయపడి అవి దాడి చేసినట్టుగా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రకృతిని నాశనం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. ప్రకృతే సమాధానం చెబుతుంది అని చెప్పడానికి ఈ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ.
Get out!!! This is our place!pic.twitter.com/tkhRcdH7m5
— Figen (@TheFigen) February 13, 2022