Viral Video : పెళ్లికూతురు డ్యాన్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లికూతురు డ్యాన్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :11 June 2022,2:00 pm

Viral Video : పెళ్లి కూతురు సిగ్గుతో త‌ల దించుకునే రోజులు పోయాయి.. ఒక‌ప్పుడు సిగ్గు, భ‌యంతో త‌ల దించుకున్నాం.. ఇప్పుడు రోజులు మ‌రాయి.. డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం.. కాద‌ని ఎవ‌రైనా ఆపితే అస్స‌లు త‌గ్గం అంటున్నారు అమ్మాయిలు.. ఇక పెళ్లంటే చాలు డ్యాన్స్ చేయ‌డానికి ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. సంగీత్, ఫొటో షూట్స్, మ్యారేజ్, రిసెప్ష‌న్, బ‌రాత్ ఇలా ప్ర‌త్యేకంగా ఒక్కో ఈ వెంట్ లో ఒక్కోర‌కంగా వెడ్డింగ్ ఆర్గ‌నైజ‌ర్స్ తో క‌లిసి ప్లాన్ చేసుకుని ఆ జ్ఞాప‌కాల‌ను దాచుకుంటున్నారు. పెళ్లంటే తాళీ.. త‌లంభ్రాలు మాత్ర‌మే కాదు.. ఫొటో షూట్స్, డ్యాన్స్ కూడా అంటున్నారు.

ఈ త‌రహా క‌ల్చ‌ర్ ఈ మ‌ధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. నెట్టింట్లో ఈ వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌టంతో చాలా మంది ఇలాగే త‌మ పెళ్లిని ప్లాన్ చేసుకుంటున్నారు. అందంగా ముస్తాబై డ్యాన్స్ చేస్తూ మండ‌పానికి వ‌స్తున్నారు. అక్క‌డే పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేసేస్తున్నారు. ఇక పెళ్లి త‌ర్వాత రిసెప్ష‌న్ లో ప్ర‌త్యేకంగా గ్రూప్ డ్యాన్స్ లు, అబ్బాయిల‌తో, అమ్మాయిల‌తో ఆక‌ట్టుకునే విధంగా ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ వీడియోలు, ఫొటోల‌కు ఫోజులిస్తున్నారు. స్టేజిపై డ్యాన్స్ తో పెళ్లి కూతురు చేసే అడావుడి అంతాఇంతా కాదు. బంధువులు, ఫ్రెండ్స్ ఎంక‌రేజ్ చేస్తూ కొత్త‌ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

bride dance video on viral

bride dance video on viral

సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ట్రెండ్ ఫాలో అవ్వ‌డం మానేసి.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ కేర‌ళ వెడ్డింగ్ లో పెళ్లి కూతురు గ్రూప్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. చీర‌క‌ట్టులో అందంగా ముస్తాబై స్టేజిపై అమ్మాయిల‌తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. అలాగే అబ్బాయిలు లుంగీ పంచ‌క‌ట్టులో పెళ్లి కూతురు వెన‌కాల చేరి పెళ్లి కూతురు వేసే స్టెప్పుల‌ను ఫాలో అవుతూ డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లికూతురు క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీంతో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి….

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది