Viral Video : పాపకు పాలు కావాలి అన్నందుకు యువతిని తీవ్రంగా కొట్టారు.. ఆ తర్వాత పాపను తీసుకొని.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పాపకు పాలు కావాలి అన్నందుకు యువతిని తీవ్రంగా కొట్టారు.. ఆ తర్వాత పాపను తీసుకొని.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :2 September 2023,4:00 pm

Viral Video : ఈరోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. మనుషులే ఈరోజుల్లో మనుషులకు శత్రువులు అవుతున్నారు. ఎదుటి వారిని చూసి పాపం అనకపోయినా పర్వాలేదు కానీ.. వాళ్లపై దాడి చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు కొందరు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా పాప ఏడుస్తోంది. కొన్ని పాలు కావాలి అని అడిగినందుకు ఓ యువతిని విచక్షణారహితంగా కొట్టారు కొందరు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ నగరంలో చోటు చేసుకుంది.

మతిస్థిమితం లేని యువతి సాగర్ బస్టాండ్ లో కూర్చొని ఉంది. తన 5 నెలల పాప ఏడుస్తోంది. దీంతో బస్టాండ్ లో ఉన్న ఓ హోటల్ లోకి వెళ్లి తన పాప ఏడుస్తోందని.. పాపకు పాలు పట్టేందుకు పాలు కావాలని అడిగింది. దీంతో హోటల్ సిబ్బంది ఆమె లాగి పడేసి తీవ్రంగా కొట్టారు. అయితే.. ఆ యువతికి మతిస్థిమితం లేనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పాపకు పాలు కావాలి అని అడిగినందుకు ఇలా కొడతారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతిపై తీవ్రంగా కొట్టిన వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే.. ఆ వీడియో పోలీసులకు చేరడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి యువతిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి పాపను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

passangers thrashed woman in busstand in madhya pradesh video viral

passangers thrashed woman in busstand in madhya pradesh video viral

Viral Video : సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఒక మహిళను పట్టుకొని పాలు అడిగినందుకు ఇంత తీవ్రంగా కొడతారా? ఇదేనా మానవత్వం. అసలు ఆ మహిళను చూసి ఎలా కొట్టాలనిపించింది. ఆమె ఏమైనా దొంగతనం చేసిందా? పాప కోసం పాలు కావాలని అడిగింది. అంతే కదా. దానికే ఆమెను చితకబాదుతారా? నిస్సహాయంగా ఉన్న ఆ మహిళను కొట్టి మీరు సాధించింది ఏంటి. ఒక తల్లి ఆవేదనను కూడా అర్థం చేసుకోలేని మీరు ఏం మనుషులు. మానవత్వం అనే పదాన్ని మరిచిపోయినట్టున్నారు అంటూ నెటిజన్లు వాళ్లపై మండిపడుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది