Viral Video : నడిరోడ్డుపై బైక్ పై రొమాన్స్ చేసిన జంట .. పోలీసులు ఎలా బుద్ధి చెప్పారో చూడండి.. వైరల్ వీడియో
Viral Video ; ప్రస్తుతం సమాజం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వావి వరుసలు లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. అంతేకాకుండా నడిరోడ్లపైనే రొమాన్స్ చేసుకుంటూ కనబడుతున్నారు. మనుషులు సిగ్గు అనే పదాన్ని విడిచినట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆడవాళ్లు మగవాళ్ళు మాట్లాడుకోవాలంటే ఎంతో సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పబ్లిక్ ముందే రొమాన్స్ చేస్తూ కనబడుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా యువత ఎక్కువగా ఇలాంటి వీడియోలలో కనిపిస్తుంటారు. బైక్ పై రొమాన్స్ సాగిస్తున్న జంటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రియుడు బైక్ నడుపుతుండగా అతడి ప్రేయసి ముందు ట్యాంక్ పై కూర్చుని గట్టిగా అతడిని కౌగిలించుకుంది. ఆ ఇద్దరు హెల్మెట్ కూడా ధరించలేదు. అయితే వారి రొమాన్స్ ను చూసిన జనం నోరెళ్ళబెడుతున్నారు. కొందరు తిట్టి చివాట్లు కూడా పెడుతున్నారు. అయినా కూడా ఆ జంట రొమాన్స్ గానే ప్రయాణం చేస్తున్నారు. అయితే వారి రొమాన్స్ ను వెనుక కారులో వెళ్తున్న వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని సింబవోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తొమ్మిదవ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పైనే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో బాగా వైరల్ కావడంతో పోలీసుల వరకు వెళ్ళింది. వారు ఈ వీడియోపై స్పందించారు. బైక్ నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి అతడికి ఎనిమిది వేల జరిమానా విధించారు. అలాగే చట్టపర్యమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పోలీసులు ఇలా కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
#Hapur Video of the romance of the new couple on the bike. The woman was sitting on the tank of the bike and hugging her husband #Viralvideo #India pic.twitter.com/hCtt4JhnWL
— Yauvani (@yauvani_1) October 10, 2023