Viral Video : మద్యం మత్తులో వివేకానంద విగ్రహంపై ఉమ్మేసిన యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : మద్యం మత్తులో వివేకానంద విగ్రహంపై ఉమ్మేసిన యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :30 August 2023,9:30 pm

Viral Video : మద్యం తాగితే మనిషి ఏం చేస్తాడో అతడికే తెలియదు. మద్యం మత్తు దిగాక ఏం చేశామో తెలుసుకొని సిగ్గుపడతాం. మనిషి అంటేనే అంత. అందుకే మద్యం జోలికి పోవద్దని పెద్దలు చెబుతుంటారు. తాగితే అన్నీ మూసుకొని ఇంట్లో పడుకోవాలి కానీ.. రచ్చ రచ్చ చేయకూడదు అంటారు. దాని వల్ల మన పరువే పోతుంది. మద్యం తాగే వాళ్లను ఈ సమాజం మంచి వ్యక్తిగా చూడదు. దానికి కారణం.. మద్యం తాగి మనం చేసే పనులే. తాజాగా ఓ యువకుడు మద్యం తాగి ఏం చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అతడు కనిపిస్తే చితక్కొడతారు.

ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరులో చోటు చేసుకుంది. పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆ యువకుడు ధ్వంసం చేశాడు. రాత్రి పూట స్కూల్ లో బాగా మద్యం తాగిన కొందరు యువకులు స్కూల్ లోనే ఉన్న స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఒక యువకుడు అయితే కర్ర తీసుకొని వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొడుతూ ధ్వంసం చేశాడు. విగ్రహంపై ఉమ్మేస్తూ బూతులు తిట్టారు. ఇతర యువకులు అతడు చేస్తున్న తతంగాన్ని వీడియో తీస్తూ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

drunken young man demolished swamy vivekananda statue in srikakulam

drunken young man demolished swamy vivekananda statue in srikakulam

Viral Video : విగ్రహం ఎవ్వరికీ కనబడకుండా దాచిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్

అయితే.. తెల్లారి స్కూల్ కు వచ్చిన తర్వాత విగ్రహం ధ్వంసం అయి ఉండటం చూసిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆ విగ్రహం ఎవ్వరికీ కనబడకుండా దాచాడు. పాఠశాల సిబ్బంది కూడా ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే.. యువకుడు చేసిన చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జనసేన నాయకులు ఆ స్కూల్ కు వెళ్లి దాచిన విగ్రహాన్ని వెలికి తీసి ఈ పని చేసిన అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది