Viral Video : వావ్.. ఇదీ అసలైన ప్రేమ అంటే.. బాతు, కుక్క పిల్ల మధ్య అనుబంధాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : వావ్.. ఇదీ అసలైన ప్రేమ అంటే.. బాతు, కుక్క పిల్ల  మధ్య అనుబంధాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 March 2022,8:30 pm

Viral Video : ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. కొన్ని అడవుల్లో ఉంటాయి. మనుషులు అయితే ఇలా ఇళ్లు కట్టుకొని నివసిస్తారు. కొన్ని జంతువులు మనుషులతో పాటే ఉంటాయి. అవి మనుషులు లేకపోతే ఉండవు. మనుషులతోనే ఉంటాయి. మనుషుల మధ్యే పెరుగుతాయి. మనుషులు లేకుంటే అవి బతకలేవు. అలాంటి వాటిలో కుక్కలు మొదటి వరుసలో ఉంటాయి. కుక్కలు ఎప్పుడూ మనుషుల మధ్యే ఉంటాయి. అందుకే వాటిని పెంపుడు జంతువులుగా మనుషులు పెంచుకుంటూ ఉంటారు.

ఆ తర్వాత పక్షి జాతులు ఉంటాయి. వాటిలో కోళ్లు, బాతులు, ఇంకా ఇతర పక్షలు ఉంటాయి. కానీ.. బాతులు, కుక్కలకు మధ్య అనుబంధాన్ని, అనురాగాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. కానీ.. ఆ రెండు కలిస్తే.. రెండింటి మధ్య ఒక స్నేహబంధం ప్రారంభమైతే ఎలా ఉంటుంది అని చెప్పేదే  ఈ వీడియో.అసలే చలికాలం. దీంతో కుక్క పిల్ల గజగజా వణికిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో వెంటనే బాతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ కుక్క పిల్ల.

duck love towards dog puppy video viral

duck love towards dog puppy video viral

Viral Video : చలికి గజగజా వణుకుతున్న కుక్కపిల్లను అక్కున చేర్చుకున్న బాతు

దీంతో వెంటనే ఆ కుక్క పిల్లను బాతు అక్కున చేర్చుకుంది. వణుకుతున్న కుక్క పిల్లను తన రెక్కల్లో దాచుకుంది. ఆ వేడికి అప్పుడు కుక్క పిల్ల వణుకుడు ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. ఇదీ అసలైన బంధం అంటే.. ఎలాంటి బేషజాలకు పోకుండా.. ఆ బాతు కుక్కపిల్లను ఎంత చక్కగా అక్కున చేర్చుకుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది