Viral Video : అయ్యో గౌడన్నా.. చూస్తుండగానే ఎలా పడిపోయాడో.. ఆ తర్వాత ఏమైందంటే..
Viral Video : తెలంగాణలో కల్లుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా కల్లును ఇష్టంగా తాగుతారు. తాటికల్లు, ఈత కల్లు ఎదైనా సరే మంచి డిమాండ్ ఉంటుంది. తాటి కల్లు మంచి కిక్ ఇవ్వగా ఈత కల్లు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఉదయం.. సాయంత్రం తాటి చెట్ల మధ్య కూర్చుని కులాసాలు మాట్లాడుకుంటూ కల్లు తాగితే ఆ కిక్కే వేరు. శని, ఆది వారాల్లో అయితే ఈ గిరాకీ మరింతగా ఉంటుంది. గౌడన్నలు అడిగిన చెట్టు కల్లు పోసి ఖుషి చేస్తారు.
కల్లు తాగి మనం ఎంజాయ్ చేస్తాం.. కానీ ఆ కల్లు తీయడానికి గౌడన్నలు ఎన్ని కష్టాలు పడతారో మనం చూడం.. ఎంతో రిస్క్ చేసి ప్రమాదకర చెట్లపైకి ఎక్కి మరి కల్లు తీసి మనకు అందిస్తారు.ఎండకు.. వానకు లెక్కచేయకుండా ఉపాధి పొందుతూ నాలుగు పైసలు సంపాదిస్తారు. అయితే ఈ కల్లు తీసే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కిందపడి ప్రాణాలు కొల్పోతారు. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎంతో మంది చనిపోయారు కూడా..
అయినా సరే తమ వృత్తిని వదులుకోకుండా రిస్క్ చేసి మరి కల్లు తీస్తారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనే జరిగింది.కల్లు తీయడానికి ఓ గౌడన్న చెట్టు ఎక్కగా పట్టుతప్పి తలకిందులుగా జారిపోయాడు. చుట్టుపక్కలున్న వారు చూసి కాపాడే ప్రయత్నం చేయగా చెట్టు మధ్యలోంచే జారి కిందపడ్డాడు. కాగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.\ ఈ దృష్యాన్ని అక్కడున్న వారు వీడియో తీసి అప్ లోడ్ చేయగా వైరల్ అవుతోంది.