Viral Video : పింఛను డబ్బులు ఇవ్వలేదని బామ్మను చితకబాదిన మనవడు.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పింఛను డబ్బులు ఇవ్వలేదని బామ్మను చితకబాదిన మనవడు.. వీడియో వైరల్

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 September 2022,2:00 pm

Viral Video : కుటుంబ బంధాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. కుటుంబ బంధాలు, బాంధవ్యాలు మంటగలిసిపోతున్నాయి. ఈ జనరేషన్ వేరు.. ఒకప్పటి జనరేషన్ వేరు. ఆ జనరేషన్ లో ఉమ్మడి కుటుంబాలదే ఎక్కువ పాత్ర. ఉమ్మడి కుటుంబాలే ఉండేవి ఎక్కువగా. కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలు.. భార్యాభర్త, ఒకరో ఇద్దరో పిల్లలు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంటే 10 మంది, 20 మంది కలిసే ఉండేవారు. చాలా ప్రేమతో, అనురాగంతో ఉండేవారు.

కానీ.. నేడు సొంత తల్లిదండ్రులను కూడా చూసుకునేవారు లేరు. ఆస్తులు, అంతస్థులు రాసిచ్చినా సొంత తల్లిదండ్రులను రోడ్డు మీద అనాథలుగా వదిలేస్తున్నారు. లేదంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. దీంతో బంధాలు, అనుబంధాలు ఎటూ కాకుండా పోతున్నాయి.

grand son demands grand mother about pension money video viral

grand son demands grand mother about pension money video viral

Viral Video : సొంత మనవడి దాష్టీకం

తాజాగా అటువంటి ఘటనే ఒకటి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చింది యశోదమ్మ అనే ముసలావిడకు ఇటీవల పింఛను డబ్బులు వచ్చాయి. దీంతో తన మనవడు గోవర్ధన్ ఆ పింఛను డబ్బులు ఇవ్వాలంటూ ఆ ముసలావిడను ఇబ్బందులకు గురి చేశాడు. తనను కాలితో తన్నాడు. డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటూ పిడిగుద్దులు గుద్దాడు. కాలితో తంతూ తనను కిందపడేసి కొట్టాడు. ఈ ఘటనను ఆ ఊరి గ్రామస్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింఛను డబ్బుల కోసం ఇంతలా పీడిస్తారా? వృద్ధురాలు అని కూడా చూడకుండా తనపై ఇంతగా దాష్టీకానికి పాల్పడతారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది