Viral Video : కర్రసాముతో అదరగొడుతున్న బామ్మ.. వీడియో వైరల్
Viral Video: కర్రసాము ఆత్మరక్షణలో భాగంగా చాలా మంది నేర్చుకుంటారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఆసక్తి చూపుతారు. గతంలో గ్రామాల్లో ఎక్కువగా ఈ శిక్షణలు ఇచ్చేవారు. చాలా మంది కర్రసాము నేర్చుకోవడానికి ఇష్ట పడతారు. తీరిక సమయాల్లో యువకులందరూ కర్రసాము ప్రదర్శన చేసేవారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా కర్రసాములో ప్రతిభ కనబరుస్తున్నారు. ఆత్మ రక్షణ కోసం కర్రసాము నేర్చుకుని పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. కర్రసాములో శిక్షణ పొంది పలు పోటీల్లో కూడా పాల్గొంటున్నారు.
ఎక్కువగా కర్రసాము తమిళనాడులో కనిపింస్తుంటుంది. తమిళులు ఎక్కువగా తమ ఆచార సాంప్రదాయాలను, కట్టు బొట్టును కాపాడుకోవడటానికి ప్రాధాన్యత ఇస్తారు. కర్రసాము పోటీలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంటాయి. మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులతో ప్రోత్సహిస్తున్నారు.కర్రసాము రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి వ్యాయామం కూడా అవుతుంది. కర్రసాము సాధనలో అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ముందుంటున్నారు. ఆత్మరక్షణలో భాగంగా నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. కొన్ని ఫౌండేషన్స్, సంస్థలు ఈ శిక్షణను ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం ఓ బామ్మ కర్ర తిప్పుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.గ్రామాల్లో ఇప్పటికీ కొంతమంది వృద్దులు తమకు తెలిసన కర్రసాము చేసి చూపిస్తుంటారు. ఎనబై… తొంబైలలో కూడా కర్రసాము చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రస్తుతం ఓ బామ్మ కూడా రెండు చేతులతో రెండు కర్రలను అవలీలగా తిప్పేస్తోంది. ఈ వయసులో కూడా ఎంత ఆక్టివ్ గా ఉందో.. అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.