Viral Video : పిల్లి, పావురం వీడియోతో అద్బుతమైన మెసేజ్ ఇచ్చిన టీ పోలీసులు
Viral Video : తెలంగాణ ఆర్టీసీ మరియు తెలంగాణ పోలీసు వారు జనాలకు అవగాహణ కల్పించేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా మోసపోకండి.. తస్మాత్ జాగ్రత్త అని పోస్టర్ లు పోస్ట్ చేయడం కాకుండా కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తూ మీమ్స్ ను మరియు వీడియోలను క్రియేట్ చేసి మరీ జనాలకు అవగాహణ కల్పిస్తూ ప్రతి ఒక్కరిని కూడా చైతన్య పర్చడంలో తెలంగాణ పోలీసులు సఫలం అవుతున్నారు అనడంలో సందేహం లేదు. తాజాగా టీ పోలీసులు షేర్ చేసిన ఒక వీడియో వారికి హ్యాట్సాఫ్ కొట్టకుండా ఉండలేక పోతున్నాం.
సైబర్ నేరగాళ్లు ఎంతగా కనికరం లేకుండా వ్యవహరిస్తారో తెలియజేయడం కోసం వీడియోను షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒక పిల్లి నక్కి నక్కి తన ముందు ఉన్న పావురంను వేటాడేందుకు ప్రయత్నం చేస్తుంది. ఏమాత్రం అలికిడి కాకుండా మెల్లగా అడుగులు వేస్తూ పావురం వద్దకు చేరుకుంది. పావురం తిరిగి చూసి కూడా అక్కడ నుండి వెళ్లక పోవడంతో ఆ పావురం కు కళ్లక కనిపించడం లేదు అని పిల్లికి అర్థం అయ్యింది. కళ్లు లేని ఆ పావురంను వేటాడేందుకు పిల్లికి మనసొప్పలేదు. దాంతో ఆ పావురంకు ఒక కిస్ ఇచ్చి మరీ వెనక్కు వెళ్లిపోయింది.
ఆ వీడియోను షేర్ చేసిన పోలీసులు ఆసక్తికర కామెంట్ ను కూడా పోస్ట్ చేశారు.. ట్వీట్ లో.. వేటాడబోయిన పిల్లి, ఆ పావురం గుడ్డిదని తెలిసి కనికరంతో వదిలేసి వెళ్ళిపోయింది. కానీ “సైబర్ నేరగాళ్లు” ఎలాంటి కనికరం లేకుండా వారి మాయ మాటలతో వల విసిరి మన కష్టార్జితాన్ని మొత్తం దోచేస్తారు. కావున సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం, వారి ఎత్తులకు పై ఎత్తులు వేద్దాం. #cyberawareness…. ఈ వీడియో మరియు పోలీసు వారి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మంచి పిల్లి వీడియోను మీరు కూడా చూసేసి పోలీసు వారు చెప్పినట్లుగా సైబర్ నేరగాళ్ల నుండి చాలా జాగ్రత్తగా ఉండండి.
వేటాడబోయిన పిల్లి, ఆ పావురం గుడ్డిదని తెలిసి కనికరంతో వదిలేసి వెళ్ళిపోయింది. కానీ “సైబర్ నేరగాళ్లు” ఎలాంటి కనికరం లేకుండా వారి మాయ మాటలతో వల విసిరి మన కష్టార్జితాన్ని మొత్తం దోచేస్తారు. కావున సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం, వారి ఎత్తులకు పై ఎత్తులు వేద్దాం. #cyberawareness pic.twitter.com/wr04ix9ojd
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 17, 2022