Viral Video : వీటి తెలివి తెల్లార.. ఈ కోళ్లు మామూలువి కావు.. ఏం చేశాయో చూస్తే నోరెళ్లబెడతారు
Viral Video : ఈ విశ్వంలో మనుషులకే తెలివి ఉంటుంది. మనుషులే మాట్లాడగలరు.. మనుషులే తెలివితో ఆలోచించగలరు.. ఇంకే జీవికి అంత సీన్ లేదు అని మనుషులు విర్రవీగుతుంటారు. కానీ.. మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ తెలివితేటలు ఉన్నవే. కాకపోతే.. వేటి తెలివి వాటిది.ఏ జీవి అయినా వాటి తెలివి తేటలను అవసరానికే ఉపయోగిస్తాయి. వాటికి అవసరం ఉన్నప్పుడే వాడుతాయి. కానీ.. మనుషులు మాత్రం అవసరం ఉన్నా లేకున్నా తెలివిని ఉపయోగిస్తారు.
కాకపోతే మనుషులు మాట్లాడగలరు.. మిగితా జీవులు మాట్లాడలేవు. అయితే.. ఏ జీవికైనా వాటి జాతి జీవాలతో మాట్లాడే అదృష్టాన్ని ఆదేవుడు ఇచ్చాడు.కోళ్లు కాలువను దాటడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో కోళ్లు ఒక కాలువను ఎలా దాటాయో చూసి ఆశ్చర్యపోతారు. నోరెళ్లబెడతారు. ఎందుకంటే.. సాధారణంగా కోళ్లకు అసలు తెలివి ఉండదు అంటారు. అందుకే మనుషులను కోడి మెదడుతో పోల్చుతుంటారు. అరేయ్.. కోడి మెదడోడా అంటూ ఆటపట్టిస్తుంటారు.

intelligent hens crossing canal viral video
Viral Video : కోళ్లు కాలువను ఎలా దాటాయో చూడండి
కానీ.. ఈ వీడియో చూస్తే.. కోళ్లకు ఉన్న తెలివిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. నిజమే.. కోళ్లకు కూడా బ్రెయిన్ ఉందండోయ్ అంటారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఒక కాలువ.. ఆ కాలువ మీద గొలుసులతో కట్టేశారు. ఆ గొలుసుల మీద వేటికీ నడవరాదు. కానీ.. వందల సంఖ్యలో కోళ్లు మాత్రం ఒక దాని వెనుక మరొకటి.. ఆ గొలుసును దాటుకుంటూ ఏం చక్కా ఆ కాలువను దాటాయి.దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు బాప్ రే.. కోళ్లకు ఇంత తెలివా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటికి ఉన్న తెలివిని చూసేయండి.
View this post on Instagram