Viral Video : ఆ ఊరికి ఇప్పటికీ రోడ్డు లేదు.. డెలివరీ అయిన మహిళను ఎలా హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారో చూడండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఆ ఊరికి ఇప్పటికీ రోడ్డు లేదు.. డెలివరీ అయిన మహిళను ఎలా హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారో చూడండి

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 October 2022,3:30 pm

Viral Video : ఇప్పటికీ ఆ ఊరికి రోడ్డు లేదు. నడిచే బాట కూడా లేదు. ఏదైనా అయితే వెళ్లడానికి హాస్పిటల్ కూడా లేదు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా రోడ్లు లేని ఊళ్లు ఉన్నాయా? బేసిక్ ఫెసిలిటీలు లేని ప్రాంతాలు ఇంకా ఈ దేశంలో ఉన్నాయా అని మీరు అనొచ్చు. దానికి నిదర్శనమే ఈ వీడియో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం.. ఆ ఊళ్లో కనీసం రోడ్లు కూడా లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెప్పే వీడియో ఇది. రాయడానికి వందల పేజీలు అవసరం లేదు.. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు.

మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కనీసం కరెంట్ కూడా ఉండదు. ఆ ఊళ్లలోకి వెళ్లడానికి రోడ్లు ఉండవు. ఆసుపత్రులు ఉండవు. అయితే.. ఇప్పుడు మనం చెప్పుకునే ఆ ఊరు ఎక్కడో లేదు. మన తెలుగు రాష్ట్రంలోనే. ఏపీలో ఉంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం. అక్కడ ఎక్కువగా కొండు తెగ వాళ్లు నివసిస్తారు. అయితే.. వాళ్లకు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీలు ఏం లేవు. రోడ్లు లేవు.. హాస్పిటల్స్ లేవు. దానికి నిదర్శనమే ఈ వీడియో.

kondu tribe in ap has no roads and hospitals video Viral

kondu tribe in ap has no roads and hospitals video Viral

Viral Video : డెలివరీ అయిన మహిళను 60 కిలోమీటర్లు మోసుకెళ్లారు

23 ఏళ్ల గిరిజన మహిళకు డెలివరీ అయితే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆ ఊళ్లో హాస్పిటల్ లేదు. చివరకు రోడ్డు కూడా లేదు. దీంతో ఆమెను 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డోలిలో మోసుకెళ్లారు. అది కూడా దట్టమైన అడవిలో నడిచేందుకు దారికూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను అతి కష్టం మీద మోసుకెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ జర్నలిస్టు ఆ వీడియోను ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఇంకా మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/KP_Aashish/status/1580770763526705154

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది