Viral Video : భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లను పట్టుకొని యువకుడి రచ్చ.. ఆ తర్వాత ఏమైందంటే? వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లను పట్టుకొని యువకుడి రచ్చ.. ఆ తర్వాత ఏమైందంటే? వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :26 July 2023,3:00 pm

Viral Video : ఈరోజుల్లో ఎవరు గొడవ పడటం లేదు చెప్పండి. పెళ్లయిన ప్రతి ఒక్క భర్త, భార్య గొడవపడేవాళ్లే. అసలు ఈ ప్రపంచంలో గొడవ పడని భార్య, భర్త ఉన్నారా? ఉన్నారు అంటే వాళ్ల మధ్య ప్రేమ లేదనే చెప్పుకోవాలి. అవును.. మన పెద్దలు ఏం చెబుతారో తెలుసా? భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. సర్దుకుపోవాలి కానీ.. ఇలా గొడవలు పెట్టుకొని సంసారాన్ని ఆగం చేసుకోవద్దు అంటారు. నిజానికి భార్యాభర్తల బంధం నిలవాలంటే.. జీవితాంతం వాళ్లు కలిసి సంసారం చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు సర్దుకుపోకున్నా ఆ జీవితం సజావుగా సాగదు.

అయినప్పటికీ గొడవలు పెట్టుకొని విడిపోయే భార్యాభర్తలను చాలామందిని చూశాం. రోజూ కొట్టుకునే వాళ్లను చూశాం. తమ సంసారాన్ని రచ్చకీడ్చుకునే వాళ్లను చూశాం. భర్త టార్చర్ తట్టుకోలేక భార్య, భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు చాలా చూశాం. ఈరోజుల్లో యువత చాలా తొందరపడుతోంది. చిన్న గొడవకే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

man jumped from current poll after dispute with wife video viral

man jumped from current poll after dispute with wife video viral

Viral Video : భార్య తిట్టిందని ఈ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కాడు

తాజాగా ఓ యువకుడు తన భార్య తిట్టిందని ఏకంగా కరెంట్ స్తంభం ఎక్కేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యతో గొడవపడిన ఓ యువకుడు.. కోపంతో ఇంటి నుంచి బయటికి వచ్చి కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. అయితే అప్పుడు కరెంట్ లేకపోవడంతో అతడికి కరెంట్ షాక్ కొట్టలేదు. దీంతో అతడు స్తంభం మీది నుంచి దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తీవ్ర గాయాలు అయిన ఆ వ్యక్తిని స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది