Viral Video : క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ .. వైరల్ అవుతున్న వీడియో..!

Advertisement

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. నిత్యం వేలాది వీడియోలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనేది బంధువులు సమక్షంలో అందరి ముందు అంగరంగ వైభవంగా జరిగే పెద్ద వేడుక. అలాంటిది మైనర్లు పెళ్లిని బొమ్మలాటగా మార్చేశారు. ఇంటర్ చదువుతున్న ఇద్దరు మైనర్లు ఏకంగా తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది.

Advertisement

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గత నెల మైనర్లు వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ బాలిక, మైనర్ బాలుడు క్లాస్ రూమ్ నే మండపంగా మార్చుకున్నారు. క్లాస్ రూమ్ లోనే మైనర్ బాలుడు బాలిక మెడలో మూడు ముళ్ళు వేసేశాడు. ఈ తతంగాన్ని మొత్తం ఓ బాలిక వీడియో తీసింది. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరల్ అయిన ఫోటోలు వీడియోలు కాలేజీ ప్రిన్సిపల్ వద్దకు వెళ్లాయి.

Advertisement
Minor students got married in the class room
Minor students got married in the class room

దీంతో ప్రిన్సిపల్ విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చి టీసీ ఇచ్చి పంపించేశారు. పిల్లలు చేసిన ఈ పనికి ఇరు కుటుంబాలు తలలు పట్టుకున్నారు. వారు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే విద్యార్థులు మాత్రం ఏదో సరదాగా చేసాం అని చెప్పడం గమనార్హం. సరదాగా చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా స్టూడెంట్స్ చేసిన పని పెద్ద తప్పు. అలా చేసింది కాక సోషల్ మీడియాలో పెట్టడం మరో తప్పు. దీని వలన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సోషల్ మీడియా వచ్చాక పిల్లలు కూడా బాగా చెడిపోతున్నారు.

Advertisement
Advertisement