Viral Video : అమ్మ చెప్పింది, అమ్మాయి చేసింది… తల్లి – కూతుర్ల ఫన్నీ వీడియో ..!!
Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ వైరల్ గా మారుతుంది. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. నెటిజన్లకు ఆ వీడియో నచ్చిందంటే వేలలో లైక్స్, కామెంట్లు చేస్తూ వీడియోను మరింత వైరల్ గా మారుస్తారు. దీంతో కొంతకాలం ఆ వీడియో ట్రెండింగ్ లో ఉంటుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. తల్లి కూతుర్ల మధ్య జరిగిన ఫన్నీ సంఘటన సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను కుష్బూ అనే యూజర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. ఆ వీడియోకు ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
వైరల్ అవుతున్న వీడియోలో తల్లి కూతురిని పిలుస్తుంది. దీంతో ఆమె గది నుండి బయటికి వస్తుంది. దీంతో తల్లి తలుపు వద్ద ఉన్న బియ్యం బస్తాన్ని తీసి వేరేచోట పెట్టమని చెబుతుంది. దీంతో అమ్మాయి కాస్త సంకోచిస్తుంది. ఆ తర్వాత బియ్యం బస్తాను మోసుకు వెళ్లి అక్కడ పెడుతుంది. కాస్త కష్టంగా ఆ బియ్యం బస్తాను మోసుకెళ్లినట్టు వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన మొత్తాన్ని తల్లి ఫోన్లో రికార్డు చేసింది. అయితే ఆ కూతురు ప్రతిరోజు జిమ్ కు వెళ్లడం వలన ఆమెకు అది పెద్దగా సమస్య కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోకి క్యాప్షన్ కూడా పెట్టారు. నా తల్లి అత్యంత ఆరోగ్యకరమైన ఎపిక్ రోస్ట్ వీడియో రికార్డు చేసింది అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు దాకా ఈ వీడియోకు మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. వేలకు పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటీవల చూసిన వీడియోలలో ఉత్తమ రోస్ట్ వీడియో ఇది అని కొందరు కామెంట్లు చేశారు. ఆంటీ హృదయాలను దోచుకున్నారు అని మరికొందరు కామెంట్లు చేశారు. ఇలా నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేశారు.
View this post on Instagram