Viral Video : తమ్ముడికి రాఖీ కట్టడం కోసం 8 కిమీలు నడుచుకుంటూ వెళ్లిన పండు ముసలావిడ.. వైరల్ వీడియో
Viral Video : రాఖీ పండుగ అంటేనే హిందూ సంప్రదాయానికి ప్రతీక. హిందూ సంప్రదాయం ప్రకారం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పండుగను జరుపుకుంటారు. వాళ్ల మధ్య ఉన్న బంధానికి అది ప్రతీక. రాఖీ పండుగ నాడు అక్కా తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు అన్యోన్యంగా ఉంటారు. ఎంత దూరం ఉన్నా.. బిజీగా ఉన్నా సమయం చూసుకొని అక్క కానీ చెల్లె కానీ తన తమ్ముడు లేదా అన్నకు రాఖీ కట్టడం కోసం వెళ్తుంది. ఎంత కష్టమైనా సరే తన అన్నకు రాఖీ కడితేనే అక్కకు సంతృప్తి. చనిపోయిన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసింది ఓ మహిళ.
తాజాగా ఓ వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టడం కోసం నడిచే ఓపిక లేకున్నా కూడా 8 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడిచే ఓపిక లేదు, వయసు సహకరించడం లేదు. కాళ్లకు చెప్పులు లేవు. చేతిలో ఓ సంచి వేసుకొని ఓ ముసలావిడ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది.
Viral Video : కొత్తపల్లి నుంచి కొండయ్యపల్లి వరకు 8 కిమీలు నడిచిన వృద్ధురాలు
ఆ ముసలవ్వ.. తన తమ్ముడికి రాఖీ కట్టడానికి కొత్తపల్లి నుంచి కొండయ్యపల్లి గ్రామం వరకు దాదాపు 8 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లింది. తన కాళ్లకు చెప్పులు లేవు. ఎండ కొడుతోంది. కాళ్లు కాలుతున్నా కూడా ఏమాత్రం ఆలోచించకుండా తన తమ్ముడికి రాఖీ కట్టడానికి నడుచుకుంటూ వెళ్లింది. దారిలో వెళ్తున్న వాళ్లు ఆ ముసలవ్వను అడిగి ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా మొత్తం వివరాలు చెప్పింది. తన గురించి తెలుసుకొని స్థానికులు షాక్ అయ్యారు. తన తమ్ముడి మీద ఎంత ప్రేమ అంటూ మెచ్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఉన్న ముసలవ్వ తన తమ్ముడికి రాఖీ కట్టడానికి కొత్తపల్లి నుండి కొండయ్యపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తుంది..#HappyRakshabandan pic.twitter.com/K0PEEg8VDP
— HEMA NIDADHANA (@Hema_Journo) August 30, 2023