Taraka Ratna Daughter : తండ్రిని కోల్పోయి కుమిలిపోతూ అమాంతం బాలయ్యను కౌగిలించుకున్న తారకరత్న కూతురు.. వీడియో వైరల్..!!

Advertisement

Taraka Ratna Daughter : నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించడం అందరికి షాక్ కీ గురి చేసింది. 20 సంవత్సరాల వయసులో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకొని కష్టాలు ఎదుర్కొంటూ ఇటీవల గత కొద్ది సంవత్సరాల నుండి మెల్లమెల్లగా మళ్లీ పుంజుకుంటున్న తారకరత్న రాజకీయాల్లోకి రావాలని రెడీ అయ్యారు. దీనిలో భాగంగా తాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే లోకేష్ చేపట్టిన పాదయాత్ర మొదటి రోజు గుండెపోటుకు గురై బెంగళూరులో 23 రోజులపాటు

Advertisement
See How Taraka Ratna Daughter Reacts After Seeing Balakrishna
See How Taraka Ratna Daughter Reacts After Seeing Balakrishna

చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడవటం అందరికీ షాక్ ఇచ్చింది. నందమూరి కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో నిన్న స్వగృహంలో తారకరత్న పార్థీవదేహాన్ని చూసి నందమూరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అతి చిన్న వయసులోనే ముగ్గురు పిల్లలు ఉండగా ఆయన మరణించడం అందరికీ బాధను కలిగించింది. తారకరత్నని కాపాడుకోవడానికి బాలకృష్ణ ఎంతగానో శ్రమించారు. ఈ క్రమంలో బెంగుళూరు హాస్పిటల్ లో నిత్యం తారకరత్న ఆరోగ్య పర్యవేక్షణలో దగ్గరుండి చూసుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించటం జరిగింది.

Advertisement
See How Taraka Ratna Daughter Reacts After Seeing Balakrishna
See How Taraka Ratna Daughter Reacts After Seeing Balakrishna

అయినా గాని తారకరత్న మరణించడం బాలకృష్ణని ఎంతగానో కలచివేసింది. ఈ క్రమంలో తారకరత్న స్వగృహంలో నిన్న ఆయన పార్థివ దేహం వద్ద బాలకృష్ణ కూర్చుని ఉండగా… తారకరత్న పెద్ద కూతురు అమాంతం వచ్చి బాలకృష్ణ అని కౌగిలించుకుని ఏడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత మొత్తం బాలకృష్ణ తీసుకోవడం జరిగిందట. అంతేకాదు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కుటుంబ పరంగా పెద్దగా అన్ని రీతులుగా.. అండగా ఉంటానని భరోసా కూడా ఇచ్చినట్లు సమాచారం.

Advertisement
Advertisement