Viral Video : చినుకు పడితే చాలు నగరం చిత్తడే.. ట్రాఫిక్ జామ్ తో న‌గ‌ర‌వాసుల‌కు న‌ర‌కం..!

Advertisement

Viral Video : హైదరాబాద్ నగరానికి ఎంతో పేరుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి కాంచింది. ఐటీలో నెంబర్ వన్. అలాగే.. ట్రాఫిక్ జామ్ లోనూ నెంబర్ వన్. అవును.. నగరంలో చిన్న చినుకు పడితే చాలు.. ఎక్కడికక్కడ వాహనాలు నిలవాల్సిందే. ఇదేదో ఇప్పటి సమస్య కాదు. చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ లో చిన్న వర్షం కురిసినా రోడ్లన్నీ జలమయం అవుతాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ సమస్యపై ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరైన పరిష్కారాన్ని మాత్రం చూపలేకపోతున్నాయి.

Advertisement

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి. చిన్న వర్షం అయినా.. పెద్ద వర్షం అయినా.. చిన్న చినుకు పడినా చాలు.. హైదరాబాద్ మొత్తం చిత్తడి కావాల్సిందే. గత పది రోజుల నుంచి నగరంలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరమంతా ఎక్కడ చూసినా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐకియా షోరూమ్ రూట్లలో మామూలుగానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక.. వర్షం పడితే అంతే. గంటలకు గంటలు వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిందే. తాజాగా పడిన వర్షానికి ఐకియా షోరూమ్ వద్ద ట్రాఫిక్ ఎలా నిలిచిపోయిందో తెలపడానికి ఈ వీడియోనే ఉదాహరణ.. ఆ వీడియో చూసి మీరే షాక్ అవుతారు.

Advertisement

traffic jam at ikea in hyderabad video viral

Viral Video : హైటెక్ సిటీ రూట్ లో భారీ ట్రాఫిక్ జామ్

గంటల నుంచి వాహనాలు ఒకేచోట కదలకుండా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కూడా సాయంత్రం ఆఫీసు బయటికి వదిలే సమయంలో వస్తుండటంతో ఐటీ ఉద్యోగులు అందరూ సాయంత్రం ఒక్కసారిగా ఇంటికి వెళ్లేందుకు రోడ్ల మీదికి వస్తున్నారు. దీంతో ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అందుకే.. వర్షాకాలంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వాలని.. దాని వల్ల ట్రాఫిక్ సమస్యకు కాస్తో కూస్తో పరిష్కారం లభిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఐకియా వద్ద భారీగా జామ్ అయిన ట్రాఫిక్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement