Viral Video : కేసీఆర్ ప్రధాని అవడం కోసం రోడ్డు మీద చుక్క + ముక్క పంచుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. వైరల్ వీడియో
Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో సందర్భం ఏంటి.. అనేది తెలియదు కానీ.. సోషల్ మీడియలో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. నిజానికి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షిస్తాయి. అది సహజం. ఎన్నికల ముందు వాళ్లకు డబ్బులు పంచుతారు. మందు పోస్తారు. కానీ.. ఇప్పుడు ఎన్నికలు కూడా ఏం లేవు కదా. తెలంగాణలో ఎన్నికలు రావాలంటే ఇంకో సంవత్సరం ఆగాలి. ఏపీలో అయితే రెండేళ్లు. ఎంపీ ఎన్నికలు కూడా ఇంకో రెండేళ్లలో వస్తాయి. కానీ.. ఇప్పుడు ఓటర్లను ఆకర్షించడం ఏంటి.
ఇక్కడే ఏదో తేడా కొడుతోంది కదా. కానీ.. ట్విట్టర్ లో వైరల్ అవుతున్న వీడియో ఏంటి అంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఓ టీఆర్ఎస్ లీడర్ చుక్కు, ముక్క పంచుతున్నాడు. ఒక క్వార్టర్ బాటిల్, బతికున్న కోడి రెండు కలిపి అక్కడి లోకల్స్ కు పంచుతున్నాడు. మొత్తం 200 క్వార్టర్లు, 200 కోళ్లను కొందరు కార్మికులకు పంచిపెట్టారు. టీఆర్ఎస్ కండువ వేసుకొని ఉన్న వ్యక్తి టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి అని చెబుతూ ఆయనే కేసీఆర్ ప్రధాని కావాలని క్వార్టర్లు, కోళ్లను పంచాడు. కేసీఆర్, కేటీఆర్ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేసి మరీ కార్మికులకు వాటిని పంచాడు. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది అని చెబుతున్నారు.
Viral Video : అతడు టీఆర్ఎస్ లీడర్ కాదంటున్న టీఆర్ఎస్ నేతలు
అయితే.. ఈ వీడియో వైరల్ అవడంతో ఈ విషయం టీఆర్ఎస్ అధిష్ఠానానికి కూడా తెలిసింది. ఆ వీడియోలో చెప్పబడుతున్నట్టుగా గులాబీ కండువా కప్పుకొని ఉన్న వ్యక్తి అసలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కాదని, ఆయన ఎవరో కూడా తమకు తెలియదని, ఇదంతా కావాలని ఎవరో టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న దుష్ప్రచారం అంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ ఘటనపై అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటన వస్తే కానీ.. దీనిపై కాస్త క్లారిటీ వస్తుందేమో.
https://twitter.com/KP_Aashish/status/1577230738168360960