Viral Video : ఒంటి కాలు పై సిమెంట్ బస్తాలు మోస్తున్న వ్యక్తి… ఈ వీడియో చూసి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఒంటి కాలు పై సిమెంట్ బస్తాలు మోస్తున్న వ్యక్తి… ఈ వీడియో చూసి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు…

 Authored By aruna | The Telugu News | Updated on :30 July 2022,8:00 pm

Viral Video : మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసం తోడుగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సులువుగా అధిగమించవచ్చు. ప్రపంచం ముందు మనమేంటో నిరూపించుకోవచ్చు. అందుకోసం మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన చుట్టూ ప్రక్కల ఉండే కొందరు వ్యక్తులే మనకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇలాంటివారిని చూసి మనం జాలి పడడమే కాదు ఎంతో స్ఫూర్తి పొందుతాం. అయితే తాజాగా వీల్ చైర్ లో కూర్చోవాల్సిన వ్యక్తి సిమెంట్ బస్తాలను మోస్తున్నాడు. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఈ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది ఈ వీడియోని చూసి ఎమోషనల్ అవుతున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మన పోరాటాన్ని శక్తిగా మార్చుకోవడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని అంటారు. మన జీవితానికి అన్వయించుకోవడం అంత సులభం ఏమి కాదు. అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు చూస్తే నిజంగానే ఎమోషనల్ అవుతారు.

Viral Video handicaped person Lifting Cement bag

Viral Video handicaped person Lifting Cement bag

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కి కాలు లేదు. అయినా చేతి కర్రల సహాయంతో సిమెంట్ బస్తాలు మోస్తున్నాడు. ఇది చూసిన అందరూ భావోద్వేగానికి గురి అవుతున్నారు. అతను చేసేది చిన్న పని అయినా ఈ వీడియో చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలు నిస్సహాయతతో ఆత్మహత్య చేసుకునే యువతకు ఈ వ్యక్తి ధైర్యం ఒక మేలుకొలుపుతుందని భావించవచ్చు. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. ధైర్యం ఉన్నవారికి దేవుడు కూడా అండగా నిలుస్తాడు. మన మట్టిలోనే ఏదో గొప్పతనం ఉంది అంటూ సిమెంట్ బస్తాలు మోస్తున్న వ్యక్తిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది