Viral Video : డిప్యూటీ తహశీల్దార్ వేధింపులు.. చెంప చెల్లుమనిపించిన మహిళ.. వీడియో !
ప్రధానాంశాలు:
Viral Video : డిప్యూటీ తహశీల్దార్ వేధింపులు.. చెంప చెల్లుమనిపించిన మహిళ.. వీడియో !
Viral Video : ఈ రోజుల్లో మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. ఆఫీసులో పని చేసే చోట అలాగే వారు జర్నీ చేసే సమయంలో బస్సుల్లో ఇలా ఎక్కడ చూసినా ఎవరో ఒకరు వారిని వేధిస్తూనే ఉన్నారు. ఇంకొందరు అయితే దారుణంగా అత్యాచారాలు చేస్తు మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు. దాంతో అమాయక ఆడవారు బలైపోతున్నారు. అయితే ఇలాంటి ఆకతాయిలను కొందరు మహిళలు ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం వారికి భయపడి ఏదో ఒకటి చేసేసుకుంటున్నారు. అందులోనూ పెళ్లి అయిన వారికి ఈసమ్యలు ఎక్కువగా ఉంటున్నాయి.
Viral Video : నీచంగా వేధిస్తూ..
ఇలాంటి ఆకతాయిలు వేధిస్తున్నారని చెబితే భర్త ఎక్కడ అనుమానిస్తాడో అనే టెన్షన్ వారిలో ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే నలిగిపోతున్నారు. ఇంకొందరు మహిళలు మాత్రం ఆకతాయిలను ఏకిపారేస్తున్నారు. అక్కడికక్కడే తాట తీస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ మహిళ ఇలాంటి ధైర్యమే చేసింది. ఓ డిప్యూటీ తహశీల్దార్ స్థాయిలో ఉన్న వ్యక్తి దిక్కుమాలిన పని చేశాడు. తాను ఓ పెద్ద గవర్నమెంట్ జాబర్ అనే విషయాన్నికూడా మర్చిపోయారు. ఓ మహిళను నీచంగా వేధించాడు. దాంతో ఆ మహిళకు కోపం వచ్చింది. వెంటనే చెంప చెల్లుమనిపించింది.

Viral Video : డిప్యూటీ తహశీల్దార్ వేధింపులు.. చెంప చెల్లుమనిపించిన మహిళ..!
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది. నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తన అపార్టుమెంట్ లో ఉంటున్న మహిళను నిత్యం వేధిస్తున్నారు. అసభ్యకరంగా ఫోన్లో వీడియోలు, వీడియోలు తీస్తూ వేధిస్తున్నాడు. అయితే ఆమె మేడపై బట్టలు ఆరేస్తున్న సమయంలో అతను అక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆమెను అసభ్యకర్ంగా కామెంట్ చేయడంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అతని వద్దకు వచ్చి చెంప చెల్లుమనిపించింది. దాంతో సదరు వ్యక్తి షాక్ అయిపోయాడు.
బాధితురాలు తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో అధికారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడని.. అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ
నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది.
ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది. బాధితురాలు తన భర్తకు… pic.twitter.com/edXuPnRbWq
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024