Viral Video : పెళ్లి కొడుకును పక్కనే పెట్టుకుని రెచ్చిపోయిన పెళ్లికూతురు…. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లి కొడుకును పక్కనే పెట్టుకుని రెచ్చిపోయిన పెళ్లికూతురు…. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :25 October 2022,2:00 pm

Viral Video : రానురాను మన సంప్రదాయాలు పూర్తిగా కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ఏ శుభకార్యం చేయాలన్నా తెలుగింటి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేవారు. ఇక వివాహాల విషయానికొస్తే భారతీయ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే భారతీయ జంటలు పెళ్లిని పవిత్రంగా భావిస్తారు. అందుకే విదేశీయుల కంటే మనవారు విడాకులు తక్కువగా తీసుకుంటుంటారు. మనదేశంలో ఒకప్పుడు పెళ్లికూతురు ఇంట్లో వంచిన తల బయటకు వచ్చినా ఎత్తేది కాదు. అంతేకాకుండా భర్త ముందు మాట్లాడాలన్నా..

అత్తమామల ముందు మాట్లాడలన్నా చాలా భయపడేవారు. ఇక ఉత్తరభారతంలో నేటికి కోడళ్లు మొహం మీద కొంగు ధరిస్తుంటారు. దక్షిణభారతంలో కొంగు ధరించకపోయినా అత్తమామలకు గౌరవం ఇచ్చేవారు. వారి మాటలను జవదాటేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయాల్లో విశేషమైన మార్పులు కనిపిస్తున్నాయి. అత్తమామలను నేటి తరం కోడళ్లు బయపెట్టిస్తున్నారు. కొందరైతే వారికి ఎదురు సమాధానం చెప్పడంతో వారు దూషించేవరకు వెళ్తున్నారు. మరికొందరు అత్తమామలను కూడా ఇంట్లోంచి గెంటివేస్తున్నారు.

Viral Video on bride dance video on youtube

Viral Video on bride dance video on youtube

Viral Video : కాలానుగుణంగా మారుతున్న సంప్రదాయాలు

ఇలా కోడళ్లు ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు సెట్ చేస్తామంటున్నారు. ఇక పెళ్లి బరాత్ టైంలో పెళ్లికూతురు సైలెంట్‌గా కారులో కూర్చునే వధువు.. నేడు ఏకంగా బుల్లెట్ బండి పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఎదురుంగా అత్తమామలు, ఆడబిడ్డలు, భర్త ఎవరున్న చూడటం లేదు. తమకు తోచిన విధంగా చేస్తూ ఇతరుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓపెళ్లికూతురు భర్తను పక్కనబెట్టుకుని బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేస్తుందగా వరుడు షాక్ అయిపోయే అలానే దిక్కులు చూస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పెళ్లికూతురికి మంచి బీట్ వినిపిస్తే ఎవరి మాట వినేలా కనిపించడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది