Viral Video : మెడలో తాళి పడగానే ఆపుకోలేకపోయిన వధువు.. పెళ్లికొడుకుతో ఏం చేసిందంటే?
Viral Video : ప్రతిఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక కీలక ఘట్టం అంటారు.పెళ్లి గడియలు దగ్గరపడితే జరిగే దానిని ఆపడం ఎవ్వరి తరం కాదని కూడా నానుడి ఉంది. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాలతో పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు కాలం మారింది. దానికి భిన్నంగా సంప్రదాయాలు కూడా మారుతున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల పాత సంప్రదాయాలను పాటిస్తున్నా.. మరికొందరు మాత్రం తమ పిల్లల సంతోషమే ముఖ్యం అని వారికి నచ్చిన విధంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. మన దేశంలో చాలా వరకు పెళ్లిళ్లు పెద్దల అంగీకారం మేరకు జరుగుతుంటాయి.
ఈ మధ్యకాలంలో పిల్లలు తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయిని చూపించి వారినే పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు.దీనికి కొందరు పేరెంట్స్ అంగీకరిస్తుంటే మరికొందరు పిల్లల ఒత్తిడి మేరకు అంగీకరిస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వారిని చేసుకుని పెళ్లి తర్వాత బాధపడే బదులు.. బాగా తెలిసిన అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని నేటితరం భావిస్తోందట.. ఈ క్రమంలోనే తమిళ సంప్రదాయంలో ఓ జంట పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరగగా.. అమ్మాయి, అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వీడియో చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
Viral Video : తన కళ నెరవేరిన తరుణాన ఆగలేకపోయిన వధువు..
అయితే, పెళ్ళి కొడుకు తాళి కట్టే సమయంలో పెళ్లికూతురు ఓవర్ ఎక్సైట్ అయ్యింది. ఆనందంతో చప్పట్లు కొట్టింది. అబ్బాయి తాళి కడుతున్నంత సేపు సైలెంట్‌గా చూస్తూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది. ఈ రోజు కోసం చాలా కాలంగా తను ఎదురుచూసినట్టు ఇట్టే అర్థం అవుతోంది. తాళి కట్టిన అనంతరం ఆనందాన్ని ఆపుకోలేక పెళ్లి కొడుకు బుగ్గపై ముద్దుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వీడియోను చూసి చాలా జంటలు కంగ్రాట్స్ అని విషెస్ చెబుతున్నారు. మరికొందరు అయితే అబ్బాయి కంటే అమ్మాయి చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.
என்னம்மா இப்படி பண்றிங்களேம்மா???? pic.twitter.com/GOKCkLOHT6
— செல்வம் அரசுப்பள்ளி ஆசிரியர்.. (@selvachidambara) September 13, 2022