Viral Video : పాపం .. రాపిడో రైడర్… పెట్రోల్ అయిపోయిన బైక్ దిగని కస్టమర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పాపం .. రాపిడో రైడర్… పెట్రోల్ అయిపోయిన బైక్ దిగని కస్టమర్..!

 Authored By aruna | The Telugu News | Updated on :12 February 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : పాపం .. రాపిడో రైడర్... పెట్రోల్ అయిపోయిన బైక్ దిగని కస్టమర్..!

Viral Video : కాలంతోపాటు జీవనశైలి కూడా మారుతుంది. పోటీ ప్రపంచంలో వేగాన్ని అందుకోలేకపోతే వెనుకబడటం ఖాయం. దీంతో మన దేశం ఇప్పటికే టెక్నాలజీని చాలా అభివృద్ధి చేసింది.అలాగే బైక్ టాక్సీ సంస్థ ప్రజలకు బైక్ సేవలు అందుబాటులోకి తీసుకోవచ్చింది . అందులో ఒకటే రాపిడో బైక్ టాక్సీ. తక్కువ కాలంలోనే ఈ సంస్థ తమ సేవలను వేగంగా విస్తరింపజేసింది. ప్రతి వ్యక్తికి బైక్ సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రాపిడో సేవలను విస్తరిస్తుంది. ఈ బైక్ టాక్సీ వలన చాలామందికి ఉపాధి కలుగుతుంది. యువతకు సొంత నగరంలోనే ఉపాధి అవకాశం కలుగుతుంది. రాపిడో బైక్ టాక్సీ అతి తక్కువ ఖర్చుతో కస్టమర్లను వారు అనుకున్న గమ్యానికి చేరుస్తుందిష అయితే కొన్నిసార్లు రాపిడో ద్వారా రైడర్లు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తాజాగా అందరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాదులో ఓ వ్యక్తి రాపిడో బైక్ బుక్ చేసుకోని వెళుతుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోతుంది. దీంతో రైడర్ బైక్ లో పెట్రోల్ అయిపోయిందని బంకు వద్దకు నడుచుకుంటూ రావాలనే కష్టమర్ ని అడిగాడు. అయితే అందుకు కష్టమర్ బంకు వరకు నడవనని చెప్పాడు. దీంతో రైడర్ కస్టమర్ నన బైక్ పై కూర్చోబెట్టుకొని తోసుకుంటూ వెళ్ళాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో రాపిడో రైడర్ బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో కస్టమర్ బైక్ పై ఎక్కించుకొని బంకు వరకు తోసుకుంటూ వెళ్ళాడు. కష్టపడి నెట్టుకుంటూ బంకు వరకు కస్టమర్ ను నెట్టుకుంటూ తీసుకువెళ్లాడు.

ఇక కస్టమర్ రైడర్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా ఎక్కడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు పెట్రోల్ మార్గమధ్యంలో అయిపోతుండడం చూస్తూ ఉంటాం. ముందు జాగ్రత్తగా ఉన్న కొన్ని సార్లు పెట్రోల్ అయిపోతుంది. అది ఆ రైడర్ విషయంలో జరిగింది. అది అర్థం చేసుకోకుండా కష్టమర్ బైక్ మీద కూర్చున్నాడు. ఫ్రీగా బైక్ తీసుకు వెళ్లదు కదా ఎంతోకొంత ఛార్జ్ చేస్తాం కాబట్టి ఆ రైడర్ ఎలాగైనా తనని నెట్టుకుంటూ వెళ్తాడని, నేను డబ్బులు చార్జ్ చేసి నడవాలా అనే ఉద్దేశంతో అతడు రైడర్ ను ఇబ్బంది పెట్టాడు. ఇది చూసిన కొందరు పాపం రైడర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పాపం రైడర్ అని మరి కొందరు రైడర్ పరిస్థితిని ఆ కష్టమర్ అర్థం చేసుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది