Viral Video : అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. రెండు చేతులతో ఎలాగైనా రాసేస్తా..
Viral video: కొంత మందికి రాయడమంటేనే బద్దకం ఎంత సేపైనా మాట్లాడగలుగుతారు.. రాయమంటే ఆసక్తి చూపలేరు. కొంత మంది బోర్డు పై రాయాలంటే ఇబ్బంది పడతుంటారు. మరి కొంతమంది కొంతవరకు రాయగలరు. కొంతమంది ఐతే పక్కవాళ్లు, ఫ్రెండ్స్ తో రాయిస్తుంటారు. కొంత మందికి రాయడం అంటే చాలా ఇష్టం ఒక చేతితో బాగానే రాస్తారు. కొంత మంది లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తారు. చాలా వరకు రైట్ హ్యాండ్తో రాస్తారు.
కొంత మంది లెఫ్ట్, రైట్ హ్యాండ్తో రాయగలరు. కానీ ఏకకాలంలో లెఫ్ట్, రైట్ హ్యాండ్ తో రాసేవాళ్లు చాలా అరుదు.అయితే బెంగళూర్ కి చెందిన ఓ అమ్మాయి మాత్రం ఏకకాలంలో రెండు చేతులతో రాస్తూ అబ్బురపరుస్తోంది. రైట్ హ్యాండ్తో రాస్తూ.. అవే పదాలకు లెఫ్ట్ హ్యాండ్తో వాటి ప్రతిబింబాలను అవలీలగా రాసేస్తోంది. చేతిరాతతో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. కర్టాటకకు మంగళూరుకు చెందిన ఆది స్వరూప ఓ చేత్తో మామూలు అక్షరాలు మరో చేత్తో వాటి ప్రతిబింబాలు రాయగలదు.

Viral Video Right with both hands anyway
ఏకకాలంలో 16 మంది చెప్తుండగా విని రాయాలని ప్రయత్నిస్తోందట. ప్రస్తుతం స్వరూప బోర్డుపై రాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు స్వరూపను ప్రశంసల్లో ముంచెత్తున్నారు. ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నారు. వావ్.. అమేజింగ్.. వావ్ షీ ఈజ్ అవేసమ్.. వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి ప్రశంసిస్తున్నారు. మీరు కూడా స్వరూప ప్రతిభను చూసేయండి మరి…
“Are you right or left handed?”
“Yes”
???? pic.twitter.com/vifR9SGWyR— Morissa Schwartz ???? (Dr. Rissy) (@MorissaSchwartz) April 8, 2022