Police Station : పోలీస్ స్టేషన్‌ని డ్యాన్స్ క్లబ్‌గా మార్చేసారుగా.. కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త రచ్చ పీక్స్..వీడియో !
ప్రధానాంశాలు:
Police Station : పోలీస్ స్టేషన్‌ని డ్యాన్స్ క్లబ్‌గా మార్చేసారుగా.. కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త రచ్చ పీక్స్..!
Police Station : తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. అయితే కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చెలరతున్నారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కాంగ్రెస్ జడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే డ్యాన్సులు వేస్తూ వీడియో చిత్రీకరించడం సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చి నేనున్నాను సినిమా పాటకి స్టెప్పులేస్తూ ఆడిపాడాడు.
Police Station : ఏంటి.. ఈ అరాచకం
అంతేకాదు ప్రభుత్వ అధికారులు తాను చెప్పినట్టు నడుచుకుంటారని స్నేహితులకు శ్రీనివాస్ వీడియో పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాధ్యతగా మెలగాల్సిన వ్యక్తి పోలీస్ స్టేషన్ డ్యాన్స్ క్లబ్‌గా మార్చారని ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోలీసుల పేరు చెప్పి ఇసుక క్వారీల్లోనూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారం అండ చూసుకొని అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని మహదేవ్‌పూర్ స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అదే అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ వీడియో చూసిన వారు ఇది పోలీస్ స్టేషనా లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూటా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి ఆగడాలు జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారని కొందరు ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏమైన స్పందిస్తారా, ఆయనపై కఠిన శిక్ష విధిస్తారా అన్నది చూడాలి.
మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పిటీసి భర్త “మన్మధుడా” అంటూ చిందులు
పాటలు పెట్టి మరీ వీడియో తీసిన పోలీసులు.
మంథనిలో మంటగలుస్తున్న పోలీస్ ప్రతిష్ట.
మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అదే అంటున్న పోలీసులు.
పోలీస్ స్టేషనా లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూటా అని ముక్కున… pic.twitter.com/6dX9Zu4Lss
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2024