Anna Lezhneva : తిరుమల కొండపై తలనీలాలు సమర్పించిన పవన్ భార్య.. నెట్టింట్లో కామెంట్స్
ప్రధానాంశాలు:
Anna Lezhneva : తిరుమల కొండపై తలనీలాలు సమర్పించిన పవన్ భార్య.. నెట్టింట్లో కామెంట్స్
Anna Lezhinova : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు.. కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో స్వాగతం పలికారు.. దర్శనం అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Anna Lezhneva : తిరుమల కొండపై తలనీలాలు సమర్పించిన పవన్ భార్య.. నెట్టింట్లో కామెంట్స్
Anna Lezhneva శ్రీవారికి మొక్కులు..
ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆమె మొదట శ్రీభూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం దగ్గర కళ్యాణకట్ట తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో, హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని డిక్లరేషన్ పై సంతకం చేశారు.
పవన్ కళ్యాణ్, లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటన సమయంలో విశాఖ పర్యటనలో ఉన్న పవన్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. ఆయనతో పాటు సోదరుడు చిరంజీవి, ఆయన సతిమణి సురేఖ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం పవన్ దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే తన కుమారుడు క్షేమంగా బయటపడడంతో పవన్ భార్య లెజినోవా ఆదివారం తిరుమల తిరుపతి దైవదర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించారు.