Free Gas Cylinder : ఏపీలో ఉచిత గ్యాస్ కావాలంటే ఈ అర్హతలు ఉండాలి.. గైడ్‌లైన్స్ ఇవే..!
ప్రధానాంశాలు:
Free Gas Cylinder : ఏపీలో ఉచిత గ్యాస్ కావాలంటే ఈ అర్హతలు ఉండాలి.. గైడ్‌లైన్స్ ఇవే..!
Free Gas Cylinder : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇచ్చిన ఆరు హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం పథకం) అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి దీపావళి పండగ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు అర్హులైన వారికి సిలిండర్లను అందజేస్తారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుండగా.. ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తెలిపారు.
Free Gas Cylinder డాక్యుమెంట్స్ ఇవే..
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి విధివిధానాలను ఖరారు చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈనెల 29 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. 31వ తేదీ నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతోంది. మూడు ఉచితం సిలిండర్ల (దీపం) పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్‌లో ఉన్న విధంగా పేరు, చిరుమానా రాయాలి. అనంతరం డాక్యుమెంట్స్ ఫొటోలు అప్ లోడ్ చేయాలి. చివరగా యాక్సెప్ట్ చేసి, సబ్ మిట్ చేయడంతో దరఖాస్తు పూర్తవుతుంది.
ఈ అప్లికేషన్‌లను అధికారులు పరిశీలించి.. అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.. ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ జాబితాలను ప్రదర్శించాలని భావిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక ఇబ్బందులున్నా సరే ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నామని.. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. తమకు పథకం అందలేదనే మాట అర్హుల నుంచి రాకూడదని అధికారులకు సూచించారు. అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు, యాక్టివ్ LPG కనెక్షన్ ప్రూఫ్, బియ్యం కార్డు, బ్యాంక్ ఖాతా డాక్యుమెంట్లను సిద్దంగా ఉంచుకోవాలి.యాక్టివ్ LPG కనెక్షన్, ఆధార్, మరియు బియ్యం కార్డు కలిగిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఉచిత సిలిండర్ పొందడానికి సంవత్సరానికి 3 సార్లు, ప్రతి 4 నెలలకు ఒకసారి బుకింగ్ చేసుకోవాలి.